ఎస్‌ఎఫ్‌ఐవో ఫస్ట్‌ యాక్షన్‌: భూషణ్‌ స్టీల్‌ మాజీ ప్రమోటర్‌ అరెస్ట్‌

9 Aug, 2018 21:03 IST|Sakshi

న్యూఢిల్లీ:  బ్యాంకులసీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐవో) భూషణ్ స్టీల్ మాజీ ప్రమోటర్, వైస్ ఛైర్మన్ నీరాజ్ సింఘాల్‌ను ఢిల్లీలో గురువారం అరెస్ట్‌  చేసింది.  దాదాపు 2వేల కోట్ల మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఆయన్నుఅరెస్ట్‌ చేసినట్టు  ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.   అనంతరం ఆయన్నుకోర్టులో ప్రవేశపెట్టినట్టు తెలిపింది. ఆగస్టు 14వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్టు చెప్పింది. 

దేశీయ బ్యాంకింగ్‌ రంగ మొండి బకాయిల్లో 25 శాతానికి పైగా చెల్లించాల్సి ఉన్న 12 కంపెనీల్లో భూషణ్ స్టీల్ లిమిటెడ్‌ కూడా ఒకటి .  వేలకోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసిన కంపెనీలపై  దివాలా కోడ్‌ ప్రయోగించాలని గతంలో బ్యాంకులను ఆర్‌బిఐ ఆదేశించింది.  గత ఏడాది  దివాలా చట్టం తీసుకొచ్చిన తరువాత ఎస్ఎఫ్ఐఓ అరెస్ట్‌ చేసిన తొలి వ్యక్తి సింఘాల్‌. అప్పటి మేనేజ్మెంట్ ద్వారా సేకరించిన  వేలాది కోట్ల రూపాయలను సంస్థ ప్రమోటర్లు మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందనీ,  అలాగే డైరెక్టర్లు, ప్రమోటర్లు విచారణకు  సహకరించడంలేదని ఆరోపించింది.  ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  కాగా  నీరజ్‌ సింఘాల్‌ అక్రమాలతో భూషణ్‌  స్టీల్‌ లిమిటెడ్‌కంపెనీ దివాలాకు కారకుడయ్యాడని , 80పైగా నకిలీ కంపెనీలతో పేరుతో  నిధులను అక్రమంగా మళ్లించారన‍్న ఆరోపణలున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు