నేడు మార్కెట్లు లాభాలతో షురూ!

9 Jul, 2020 08:48 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌  నిఫ్టీ 34 పాయింట్లు ప్లస్‌

నిఫ్టీకి 10639-10572 వద్ద సపోర్ట్స్‌

బుధవారం యూఎస్‌ మార్కెట్లు అప్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు లాభాల్లో

నేడు (9న) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.40 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 34 పాయింట్లు పుంజుకుని 10,716 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 10,682 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. మంగళవారం రికార్డ్‌ గరిష్టాల నుంచి వెనకడుగు వేసిన యూఎస్‌ మార్కెట్లు బుధవారం తిరిగి లాభపడ్డాయి. కోవిడ్‌-19 కేసులు తిరిగి పెరుగుతున్నప్పటికీ యూఎస్‌ మార్కెట్లు 0.7-1.5 శాతం మధ్య బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. బుధవారం ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడటంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు తొలుత హుషారుగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తదుపరి ఆటుపోట్లను చవిచచూడవచ్చని భావిస్తున్నారు.

5 రోజుల ర్యాలీకి బ్రేక్‌
చివరి గంటలో ఉన్నట్టుండి తలెత్తిన అమ్మకాలు బుధవారం దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 346 పాయింట్లు పతనమై 36,329 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు క్షీణించి 10,706 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 36,828 వద్ద గరిష్టాన్ని చేరగా.. 36,234 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ బాటలో నిఫ్టీ 10,848-10,677 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,639 పాయింట్ల వద్ద, తదుపరి 10,572 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,810 పాయింట్ల వద్ద, ఆపై  10,915 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,363 పాయింట్ల వద్ద, తదుపరి 21,141 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,944 పాయింట్ల వద్ద, తదుపరి 23,303 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.


రెండువైపులా అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 995 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 853 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. అయితే మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 830 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 784 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 348 కోట్లు, డీఐఐలు రూ. 263 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు