21 Dec, 2018 11:33 IST|Sakshi

ముంబై : ఇషా అంబానీ - ఆనంద్‌ పిరమాల్‌ల వివాహం దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా నిలిచింది. భారతదేశ కుబేరుడైన ముఖేష్‌ అంబానీ తన కూతురు పెళ్లి కోసం ఏకంగా రూ. 700 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. అంగరంగ వైభవంగా జరిగిన ఇషా పెళ్లి వేడుకకు దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు హజరయ్యారు. వారం రోజుల పాటు జరిగిన పెళ్లి తంతు పూర్తయ్యింది. ఇషా - ఆనంద్‌లు నివసింసచేబోయే ఇంటి గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. 

ఇంద్రభవనాన్ని తలపించేలా ఉన్న ఈ సౌధం విస్తీర్ణం దాదాపు 50 వేల చదరపు అడుగులు. దక్షిణ ముంబైలోని వర్లీ ప్రాంతంలో అరేబియా సముద్ర ప్రాంత సమీపంలో ఉంది. ఆనంద్‌ పిరమాల్‌ తల్లిదండ్రులు ఈ ఇంటిని నూతన దంపతులకు కానుకగా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటిదగ్గర రిన్నోవేషన్‌ పనులు జరుగుతున్నాయి. దీనితో పోలిస్తే, ముఖేష్‌ అంబానీ ఇళ్లు​ యాంటిలియా దాదాపు 8 రేట్ల పెద్దదిగా ఉంటుంది.

మరిన్ని వార్తలు