ప్రధాని ఎకానమీ ప్యానెల్‌కు షామిక

4 Nov, 2017 16:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బ్రూకింగ్  ఇండియా సీనియర్ అధికారి  డా. షామిక రవి ఆర్థిక సలహామండలికి (ఎకానమిక్‌ ఎడ్వైజరీ కౌన్సిల్‌) ఎంపికయ్యారు.  నీతి అయోగ్ సభ్యుడు వివేక్ దేబ్రాయ్ నేతృత్వంలో ఏర్పాటైన ఆర్థిక సలహా మండలి  (ఈఏసీ-పిఎం)లో ఆమె ఒక భాగంగా ఉండనున్నారు. 

ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలిలో  తాత్కాలిక సభ్యురాలిగా రవి త్వరలోనే నియమితులుకానున్నారని  సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు పీఎంవో వర్గాలనుంచి ఆమోదం లభించిందన్నారు. బ్రూకింగ్స్ ఇండియాలో  ఆర్థిక పరిశోధనకు ఆమె నేతృత్వం వహిస్తున్నారు.  అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో  ఆర్థికశాస్త్రంలో  విజిటింగ్‌  ప్రొఫెసర్‌గా ఉన్నారు.  గేమ్ థియరీ అండ్ మైక్రోఫైనాన్స్‌ కోర్సులను ఆమె బోధిస్తున్నారు. ప్రొఫెసర్ రవి  ప్రధాన వార్తాపత్రికలలో వ్యాసాలతోపాటు అనేక జర్నల్స్‌ను విస్తృతంగా ప్రచురించారు. ఆమె పరిశోధన బీబీసీ, ది గార్డియన్, ది ఫైనాన్షియల్ టైమ్స్ తో భారతదేశంలోని చాలా జాతీయ , ప్రాంతీయ వార్తాపత్రికలు  మేగజైన్లలో చోటు సంపాదించడం విశేషం.

కాగా ఇటీవల  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ఆర్థిక సలహామండలిలో డా.సూర్జిత్ బళ్లా, రతిన్ రాయ్, డా. అషీమా గోయల్, సభ్య కార్యదర్శిగా రతన్ వటల్ నియమితులయ్యారు. ఆర్థిక వ్యవహారాలు, ఇతర అంశాలపై ఆర్థిక సలహా మండలి ప్రధానికి సలహాలు ఇస్తుంది. 

మరిన్ని వార్తలు