భారీ ట్రేడింగ్‌తో ఈ షేర్ల హైజంప్‌

30 Jun, 2020 13:50 IST|Sakshi

జాబితాలో మిధానీ, ఇమామీ, బిర్లా కార్ప్‌

మయూర్‌ యూనికోటర్స్‌, తాల్‌బ్రోస్‌ ఆటో

20-6% మధ్య ప్లస్‌- లావాదేవీలూ అప్‌

అంతర్జాతీయ సంకేతాలకుతోడు దేశీయంగానూ సెంటిమెంటు బలపడటంతో మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 230 పాయింట్లు పెరిగి 35,191కు చేరగా.. నిఫ్టీ 68 పాయింట్లు బలపడి 10,380 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ షేర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో మిశ్ర ధాతు నిగమ్‌(మిధానీ), ఇమామీ లిమిటెడ్‌, బిర్లా కార్పొరేషన్‌, మయూర్‌ యూనికోటర్స్‌, తాల్‌బ్రోస్‌ ఆటోమోటివ్‌, బనారస్‌ బీడ్స్‌ తదితరాలున్నాయి. వివరాలు చూద్దాం..

మిశ్ర ధాతు నిగమ్‌
పీఎస్‌యూ రంగ కంపెనీ మిశ్ర ధాతు నిగమ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6.5 శాతం జంప్‌చేసి రూ. 219 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 222 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 2.17 లక్షల షేర్లు కాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 2.76 లక్షల షేర్లు చేతులు మారాయి. \

ఇమామీ లిమిటెడ్‌
ఎఫ్‌ఎంసీజీ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం పురోగమించి రూ. 218 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 228 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 46,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1.26 లక్షల షేర్లు చేతులు మారాయి.

బిర్లా కార్పొరేషన్‌
సిమెంట్‌ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 602 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 612 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 19,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 16,000 షేర్లు చేతులు మారాయి.

మయూర్‌ యూనికోటర్స్‌
సింథటిక్‌ లెదర్‌ ప్రొడక్టుల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 206 సమీపంలో ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 3,600 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 3.19 లక్షల షేర్లు చేతులు మారాయి.

తాల్‌బ్రోస్‌ ఆటోమోటివ్‌
ఆటో విడిభాగాల తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 13 శాతం దూసుకెళ్లి రూ. 114 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 120 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 7,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 31,000 షేర్లు చేతులు మారాయి.

బనారస్‌ బీడ్స్‌
ఇమిటేషన్‌ ఫ్యాషన్‌ జ్యువెలరీ తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 46.3 వద్ద ఫ్రీజయ్యింది.బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 3,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 5,000 షేర్లు చేతులు మారాయి.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా