బ్యాంక్స్ జూమ్‌ : షార్ప్‌ రికవరీ

12 May, 2020 15:24 IST|Sakshi

ఆర్‌బీఐ, ఆర్థికమంత్రిత్వ శాఖ ముందుకు బ్యాడ్‌ బ్యాంకు ప్రతిపాదన 

 బ్యాంకింగ్‌ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌

రిలయన్స్‌ 6 శాతం పతనం

9200 పాయింట్ల  దిగువకు  నిఫ్టీ

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల‍్ప నష్టాలకు పరిమితమైంది. కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ పొడగింపు తప్పదన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకేతాలతో ఆరంభంలో 600 పాయింట్లకు పైగా కోల్పోయిన  సెన్సెక్స్ మిడ్‌ సెషన్‌ తరువాత భారీగా పుంజుకుంది.  ఒక దశలో 30 పాయింట్ల నష్టాలకు మాత్రమే పరిమితమైంది.  చివరకు సెన్సెక్స్ 190 పాయింట్లు కోల్పోయి 31371 వద‍్ద,  43  పాయింట్ల నష్టంతో  , నిఫ్టీ  42 పాయిట్లు బలహీనపడి 9196  వద్ద ముగిసింది. వరుసగా రెండో రోజు  కూడా నష్టపోయిన నిఫ్టీ  9200 కీలక  స్థాయికి దిగువన ముగిసింది 

మరోవైపు బ్యాడ్‌ బ్యాంకు ప్రతిపాదనను ఐబీఏ ఆర్థికమంత్రిత్వశాఖకు, ఆర్‌బీఐ ముందుంచిందన్న  వార్తలు  ఇన్వెస్టర్ల సెంటిమెంటు ను ప్రభావితం చేసింది.  షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లకు తోడు, ఈ వార్తతో బ్యాంకింగ్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఇది మార్కెట్లకు  భారీ మద్దతునిచ్చింది. హెచ్‌డిఎఫ్‌సీ ట్విన్స్ రెండూ 2 శాతం , గత 11 సెషన్లుగా  నేల చూపులు చూస్తున్న ఏషియన్ పెయింట్స్ ఈ రోజు 3 శాతం  క్షీణించింది.  మార్చి త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత పిరమల్ ఎంటర్ప్రైజెస్  7 శాతానికి పైగా పతనమైంది. రిలయన్స్  6 శాతం నష్టపోయింది. మరోవైపు, ఐఆర్‌సీటిసి వరుసగా రెండవ రోజు 5 శాతం లాభంతో అప్పర్‌ సర్క్యూట్‌ అయింది. త్వరలో  విమానయాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎయిర్‌లైన్స్‌ షేర్లు , అలాగే టెలికాం షేర్లు భారతి  ఎయిర్‌టెల్‌ (5)  వొడాఫోన్‌ ఐడియా  లాభపడ్డాయి.

మరోవైపు డాలరు మారకంలో రుపీ  22 పైసలు లాభపడి 75.51 వద్ద ముగిసింది సోమవారం 75.73 వద్ద స్థిరపడిన రూపీ ఆరంభంలో 75.89 స్థాయికి బలహీనపడింది.   ఇంట్రాడేలో 75.49 గరిష్టాన్ని తాకింది.

మరిన్ని వార్తలు