ఆన్‌లైన్లో అదిరే డిస్కౌంట్లు..

7 Mar, 2015 00:55 IST|Sakshi
ఆన్‌లైన్లో అదిరే డిస్కౌంట్లు..

ఫ్యాషన్ వస్తువుల నుంచి ట్రావెల్ ప్యాకేజీల వరకూ
- హైదరాబాదీ స్టార్టప్ ‘షాపింగ్ పైరేట్స్’ సేవలు
- దేశ, విదేశాల్లోని 600 ఈ-కామర్స్ కంపెనీలతో ఒప్పందం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్లిప్‌కార్ట్‌లోనో, అమెజాన్‌లోనో షాపింగ్ చేసినపుడు డిస్కౌంట్ దొరికిందా? మరి ఎందులో ఎంత డిస్కౌంట్ వస్తోందో తెలిసేదెలా? ఇందుకోసమే కొన్ని ‘కూపన్’ సైట్లు ఆరంభమయ్యాయి.

అలాంటిదే షాపింగ్ పైరేట్స్ కూడా. ఇండియాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, అమెరికాలోనూ ఈ తరహా సేవలందిస్తున్న షాపింగ్ పైరేట్స్‌ను ఆరంభించింది హైదరాబాద్‌కు చెందిన కుల్‌ప్రీత్ మార్వా. ఈ వారం స్టార్టప్ డైరీలో వస్తున్న ఈ కంపెనీ గురించి మార్వా ఏమంటున్నారో చూస్తే...
 
మా స్వస్థలం భోపాల్. మా వారి ఉద్యోగరీత్యా పదిహేనేళ్ల క్రితమే హైదరాబాద్‌కి వచ్చి స్థిరపడ్డాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి... ఐబీ సొల్యూషన్స్‌లో కొన్నేళ్లు ఉద్యోగం చేశాను. కానీ, జాబ్ సంతృప్తినివ్వట్లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో నా అనుభవమే ఈ కంపెనీకి బీజం వేసింది. ఎందుకంటే నాకు షాపింగంటే ఇష్టం. కానీ మాల్స్‌కు వెళ్లాలంటే కాస్త భయం. పోనీ, ఆన్‌లైన్‌లో చేద్దామంటే ఏ సైట్‌లో చౌకగా లభిస్తున్నాయో తెలిసేది కాదు. ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి తెలుసుకోవడానికే చాలా సమయం పట్టేది. అప్పుడే అనిపించింది! ఇలాంటి చిక్కులేవీ లేకుండా ఆఫర్లు, డిస్కౌంట్లు అందించే కూపన్స్ సైట్‌ను ఆరంభిస్తే బాగుంటుందని. ఈ ఆలోచనను ఫండింగ్ సంస్థల ముందుంచాను. రూ.50 లక్షల పెట్టుబడిగా లభించాయి. 2014 జూన్‌లో జ్ట్టిఞ://ఠీఠీఠీ.టజిౌఞఞజీట్చ్ట్ఛ.జీ పేరిట కూపన్స్ కంపెనీని ప్రారంభించా.
 
600 ఈ-కామర్స్ కంపెనీలతో..
కూపన్లు అందించే కొన్ని సంస్థలు ఇప్పటికే ఉన్నాయి. అవి కేవలం ఫ్యాషన్ వస్తువులు, దుస్తుల వంటి వాటికే పరిమితం. షాపింగ్ పైరేట్స్‌లో ఫ్యాషన్, హెల్త్, ట్రావెల్, ఫుడ్ ఇలా అన్ని విభాగాల కూపన్లూ లభిస్తాయి. దీనికోసం యాత్రా, రెడ్‌బస్, జబాంగ్, అమెజాన్, ఈబే, ఫ్యాబ్‌ఫర్నిష్, ఫ్లిప్‌కార్ట్, హెల్త్‌కార్ట్, హోమ్‌షాప్, మేక్‌మై ట్రిప్, మింత్ర, పేటీఎం, సేఫ్టీకార్ట్ వంటి 600 ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నా. వీటిలో ఎక్స్‌క్లూజివ్ సంస్థలు 20-30 వరకూ ఉన్నాయి. అంటే వాటి కూపన్లు మా సైట్లో మాత్రమే దొరుకుతాయన్న మాట.
 
త్వరలో యూఎస్, ఆస్ట్రేలియాలోనూ..
ప్రస్తుతం షాపింగ్ పైరేట్స్ కూపన్లను ఇండియా, కెనడాల్లో అందిస్తున్నాం. రెండు వారాల్లో యూఎస్, ఆస్ట్రేలియాల్లోనూ సేవలు ప్రారంభించనున్నాం. ఆన్‌లైన్ కొనుగోళ్లు ఎక్కువగా జరిగే ప్రతి దేశంలోనూ విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం మా కంపెనీలో 15 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే వీరి సంఖ్యను 30కి పెంచుతాం.
 
నెలకు 20-30 లక్షల ఆదాయం..
ఈ-కామర్స్ కంపెనీలకు కొనుగోలుదారులను అందిస్తే ఆయా కంపెనీలు షాపింగ్ పైరేట్స్‌కు కొంత మొత్తం చెల్లిస్తాయి. షాపింగ్ ఖర్చును బట్టి ఈ మొత్తం మారుతుంది. నెలకు దాదాపుగా 20-30 లక్షలు ఆర్జిస్తున్నాం. మా కూపన్లు పొం దటం చాలా తేలిక. ఆన్‌లైన్‌లో షాపింగ్ మొత్తం పూర్తయ్యాక.. మా సైట్ లోకి వెళ్లి అక్కడున్న కూపన్లలో సరిపోయేదాన్ని ఎంచుకొని దాన్ని తిరిగి ఈ-కామర్స్ సైట్‌లో బిల్లింగ్ సమయంలో పేస్ట్ చేస్తే చాలు.

మాసైట్‌ను రోజుకు 50 వేల మంది సందర్శిస్తున్నా రు. వీరిలో 70%పైగా కూపన్లను వినియోగించుకుంటున్నారు. ఒక్కో షాపింగ్‌పై 20-30% రాయితీ పొం దవచ్చు. పండుగ సీజన్లో 50%పైనే రాయితీ పొం దొచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో షాపింగ్ చేసేవారికోసం 4 నెలల క్రితమే యాప్‌ను తయారు చేశాం.

మరిన్ని వార్తలు