-

పిల్లలకు జీవిత బీమా తీసుకోవాలా?

8 Feb, 2016 00:55 IST|Sakshi
పిల్లలకు జీవిత బీమా తీసుకోవాలా?

ఫైనాన్షియల్ బేసిక్స్..
పిల్లలకు జీవిత బీమా అవసరమా? ఈ ప్రశ్నకు కొందరేమో తీసుకుంటే మంచిదని, మరికొందరేమో అవసరంలేదని చెబుతుంటారు. బీమా కంపెనీలు మాత్రం  ‘మీరు జీవిత బీమా పాలసీ తీసుకోండి. అది మీ పిల్లల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తుంది’ అని ప్రకటనలిస్తూ ఉంటాయి. దీన్ని మనం నిశితంగా గ మనిస్తే.. మన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ.. బీమా పాలసీని వారి కుటుంబ భద్రతకు, పన్ను మినహాయింపుల కోసం తీసుకుంటారు.

ఇక్కడ పిల్లలు ఉండేది కూడా కుటుంబంలోనే కదా! అలాంటప్పుడు పిల్లలకు ప్రత్యేకంగా పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలకు బీమా పాలసీ తీసుకునే కన్నా వారి తల్లిదండ్రులు బీమాను కలిగి ఉండటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
 
జన్యు సంబంధమైన లోపాలు, వంశానుగత సమస్యల వల్ల ఆనారోగ్యం సంక్రమిస్తుందనే ఆలోచన ఉన్న పిల్లలకు బీమా పాలసీ తీసుకోవచ్చు. పిల్లలకు ఏదైనా ఆరోగ్య సంబంధిత అత్యవసర పరిస్థితి సంభవిస్తే, దాన్ని ఎదుర్కొనే సత్తా మీ వద్ద ఉన్నప్పుడు, ప్రత్యేకంగా పిల్లల కోసం పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరి కుటుంబాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉండొచ్చు. అలాంటప్పుడు పాలసీ తీసుకునే ముందు నిపుణుల సలహాల మేరకు ఒక నిర్ణయానికి రావడం ఉత్తమం.

మరిన్ని వార్తలు