లక్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్లు సమంత, సిద్ధార్థ

29 Nov, 2013 00:41 IST|Sakshi
లక్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్లు సమంత, సిద్ధార్థ

హైదరాబాద్: సినీతారల సబ్బుగా ప్రసిద్ధి చెందిన లక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లుగా ప్రముఖ సినిమా నటీనటులు, సమంత రుత్ ప్రభు, సిద్ధార్థ సూర్యనారాయణ్ వ్యవహరించనున్నారు. వీరిద్దరిపై బ్యాంకాక్‌లో  చిత్రీకరించిన కొత్త టీవీ కమర్షియల్‌ను వచ్చే నెల 1 నుంచి ప్రసారం చేస్తామని లక్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ టీవీసీని ప్రముఖ స్విట్జర్లాండ్ దర్శకుడు ఐవో వెజ్‌గార్డ్ దర్శకత్వంలో రూపొందిం చామని పేర్కొంది. ఘర్షణ చిత్రంలోని నిన్నే నిన్నే పాటను ఈ టీవీసీలో రిమిక్స్ చేశామని తెలిపింది. లక్స్ స్టార్ కావాలని తాను ఎప్పుడూ కలలు కంటూ ఉండేదాన్నని ఈ సందర్భంగా సమంత పేర్కొన్నారు. లక్స్ పేరు వినగానే సౌందర్యం, విలాసం, విశ్వాసం మదిలో మెదులుతాయని వివరించారు. లక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు