జియోలో రెండోసారి

6 Jun, 2020 07:59 IST|Sakshi

జియోలో సిల్వర్ లేక్ అదనపు పెట్టుబడులు

ఆరు వారాల్లో ఏడు డీల్స్

మొత్తం పెట్టుబడుల విలువ రూ.92,203 కోట్లు

సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్‌లలో అదనపు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. ఇప్పటికే (మే 3న) 1.15 శాతం వాటా కొనుగోలు ద్వారా రూ. 5656 కోట్లను ప్రకటించిన సంస్థ తాజాగా రూ.4547 కోట్ల మరో భారీ పెట్టుబడులను ప్రకటించింది. సిల్వర్ లేక్, తన సహ పెట్టుబడిదారులతో కలిసి 0.93 శాతం వాటాల కొనుగోలు చేయనుంది.  ఈ తాజా పెట్టుబడిలో ఎంటర్ ప్రైజ్  విలువ రూ .5.16 లక్షల కోట్లని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. (జియోలో పెట్టుబడుల ప్రవాహం: మరో మెగా డీల్)

కరోనా మహమ్మారి సమయంలో ఐదు వారాల వ్యవధిలో, జియో ప్లాట్‌ఫామ్‌లలో సిల్వర్ లేక్ అదనపు పెట్టుబడులపై రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో సిల్వర్ లేక్ రిలయన్స్ జియోలో 2.08 శాతం వాటాల  కొనుగోలు ద్వారా మొత్తం పెట్టుబడుల విలువ రూ.10203 కోట్లకు చేరింది.

కాగా గత  ఆరు వారాలుగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో జియో ఇప్పటివరకు రిలయన్స్ జియో ఏడు ఒప్పందాలను చేసుకుంది. ఫేస్ బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ (రెండు సార్లు), విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబదాలా సంస్థలు ఈ భారీ పెట్టుబడులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

జియోలో మొత్తం పెట్టుబడుల వివరాలివి..
9.99 శాతం వాటా కొనుగోలుతో ఫేస్‌బుక్  పెట్టుబడులు రూ. 43,574 కోట్లు 
1.15 శాతం వాటాతో  సిల్వర్‌లేక్ పార్ట్‌నర్స్ రూ.5,656 కోట్లు
2.32 శాతం వాటాతో   విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ రూ.11,367 కోట్లు
1.34 శాతం వాటాతో  జనరిక్ అట్లాంటిక్ రూ.6,598 కోట్లు 
2.32 శాతం వాటాతో  కేకేఆర్ రూ.11,367 కోట్లు 
1.85 శాతం వాటాతో ముబదాల రూ.9,094 కోట్లు 
0.93 శాతం కొనుగోలు  ద్వారా  తాజాగా రూ.4547 కోట్లు

మరిన్ని వార్తలు