రిలయన్స్‌–ఓఎన్‌జీసీ వివాదంలో ఆర్బిట్రేటర్‌ ఎంపిక

9 Feb, 2017 00:35 IST|Sakshi
రిలయన్స్‌–ఓఎన్‌జీసీ వివాదంలో ఆర్బిట్రేటర్‌ ఎంపిక

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ క్షేత్రాల నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) గ్యాస్‌ వెలికితీసిన వివాదంపై  ఏర్పాటైన త్రిసభ్య ఆర్బిట్రేషన్‌ ప్యానెల్‌ ప్రిసైడింగ్‌ జడ్జిగా సింగపూర్‌కి చెందిన ఆర్బిట్రేటర్‌ ప్రొఫెసర్‌ లారెన్స్‌ బూ నియమితులయ్యారు. మిగతా ఇద్దరు ఆర్బిట్రేటర్లు ఇందుకు అంగీకారం తెలిపినట్లు కేంద్ర చమురు శాఖ వర్గాలు తెలిపాయి.

పొరుగునే ఉన్న ఓఎన్‌జీసీ క్షేత్రానికి చెందిన గ్యాస్‌ను ఆర్‌ఐఎల్‌ దాదాపు ఏడేళ్ల పాటు కేజీ–డీ6లోని తమ క్షేత్ర బావుల నుంచి వెలికితీసిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి గాను మొత్తం 1.55 బిలియన్‌ డాలర్లు చెల్లించాలంటూ ఆర్‌ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థలు నికో, బీపీలకు  చమురు శాఖ నోటీసులిచ్చింది. దీనిపై నవంబర్‌ 11న ఆర్‌ఐఎల్‌ ఆర్బిట్రేషన్‌ నోటీసు ఇచ్చింది. తమ ఆర్బిట్రేటర్‌గా బ్రిటన్‌ హైకోర్టు న్యాయమూర్తి బెర్నార్డ్‌ ఎడర్‌ను ప్రతిపాదించింది.

మరిన్ని వార్తలు