గృహ బీమాపై పన్ను ఊరట

1 Jul, 2019 11:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈనెల 5న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై వివిధ వర్గాల ప్రజలు తమదైన అంచనాలు, ఆకాంక్షలు నెరవేరాలని కోరుతున్నారు. బడ్జెట్‌లో ఏయే వర్గాలకు ఊరట ఉంటుందనే అంశంపైనా పలు అంచనాలు వెల్లడవుతున్నాయి. హోం ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లింపులపై ఆదాయ పన్ను నుంచి ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో  వెసులుబాటు ఇస్తారని భావిస్తున్నారు. సెక్షన్‌ 80డీని విస్తరించడం ద్వారా లేదా గృహ, ఆరోగ్య, జీవిత బీమా చెల్లింపులపై ప్రత్యేక సెక్షన్‌ ద్వారా రిబేట్‌ను వర్తింపచేస్తారని భావిస్తున్నారు.

అందుబాటు గృహాలకు బీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను రిబేటు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు గృహ బీమా రంగంలో మార్కెట్‌ వాటా కోసం శ్రమిస్తున్న ఐసీఐసీఐ లాంబార్డ్‌, న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌, జీఐసీ ఆర్‌ఈ వంటి జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకూ ప్రభుత్వ నిర్ణయం లాభించనుంది. కాగా గృహ బీమా పన్ను నుంచి ఊరట కల్పించాలని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రీ బడ్జెట్‌ భేటీల సందర్భంగా బీమా కంపెనీలు కోరాయని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు