‘బీఎస్ ఫైవ్’ను విస్మరించకండి...

16 Jun, 2015 02:13 IST|Sakshi
‘బీఎస్ ఫైవ్’ను విస్మరించకండి...

సియాం ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్
న్యూఢిల్లీ:
భారత్ స్టేజ్ (బిఎస్) పర్యావరణ నిబంధనల విషయంలో రాజీపడకూడదని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) పేర్కొంది. ఇలా రాజీపడితే వినియోగదారుల భద్రతకే ముప్పు రాగలదని హెచ్చరించింది. బిఎస్ ఫైవ్‌ను వదిలి వేసి నేరుగా బిఎస్ సిక్స్ నిబంధనలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్న ఊహాగానాలున్నాయని, ఇది సరికాదని  సియాం  ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ చెప్పారు. ఇలా వదిలివేస్తే వినియోగదారుల భద్రత విషయంలో రాజీపడాల్సి వస్తుందని, ఇది వారి ప్రాణాలకే ముప్పు అని ఆయన వివరించారు. ప్రస్తుతం భారత్‌లోని 33 నగరాల్లో కార్లకు సంబంధించి బీఎస్-ఫోర్ నిబంధనలు అమలవుతున్నాయి. మిగిలిన చోట్ల బీఎస్ త్రీ నిబంధనలు అమల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు