ఆకర్షణీయంగా మిడ్‌క్యాప్‌ షేర్లు

9 Jan, 2020 04:48 IST|Sakshi

టాటా మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్‌ శైలేష్‌ జైన్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చౌక వేల్యుయేషన్స్‌కు లభిస్తున్న మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ షేర్లు .. ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆకర్షణీయంగా ఉన్నాయని టాటా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ మేనేజర్‌ శైలేష్‌ జైన్‌ తెలిపారు. గతంలో భారీ ప్రీమియం పలికిన ఈ స్టాక్స్‌.. ప్రస్తుతం లార్జ్‌క్యాప్‌ షేర్లతో పోలిస్తే 10 శాతం పైగా డిస్కౌంట్‌తో లభిస్తున్నాయన్నారు. కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి 10 శాతం పైగా నమోదు కావొచ్చని, జూన్‌ త్రైమాసికం నుంచి మార్కెట్‌ పరిస్థితులు మరింత సానుకూలంగా ఉండవచ్చని జైన్‌ చెప్పారు. రంగాలవారీగా చూస్తే కార్పొరేట్‌ బ్యాంకులు, టెలికం వంటివి ఆకర్షణీయంగా బుధవారమిక్కడ విలేకరులకు తెలిపారు.  

క్వాంట్‌ ఫండ్‌..: ఈ సందర్భంగా టాటా క్వాంట్‌ ఫండ్‌ వివరాలను జైన్‌ వెల్లడించారు. జనవరి 3న ప్రారంభమైన ఈ ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం 17న ముగియనుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతికతల ఆధారంగా ఈ స్కీమ్‌లో పెట్టుబడి విధానం ఉంటుందని జైన్‌ చెప్పారు. మెరుగైన రాబడులు ఇచ్చేందుకు, రిస్కులను తగ్గించేందుకు ఇది గణనీయంగా తోడ్పడగలదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు