స్మార్ట్ టైల్స్ వచ్చేశాయ్!

10 Jul, 2015 22:47 IST|Sakshi
స్మార్ట్ టైల్స్ వచ్చేశాయ్!

మార్కెట్లోకి ఐక్యూ స్మార్ట్ టైల్స్
- ఏసీపీ ఎలివేషన్స్‌కు ప్రత్యామ్నాయం
- తక్కువ ధర.. పర్యావరణహితం కూడా..
సాక్షి, హైదరాబాద్:

కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన భవనం కొద్ది రోజుల్లోనే మసకబారిపోతే..
దుమ్ము, ధూళి కారణంగా భవనాల గోడలు అందవిహీనంగా మారిపోతే..
కష్టపడి సంపాదించిన సొమ్ము కాంక్రీట్ పాలవకుండా ఉండాలంటే భవనాలకు రక్షణ కవచం (ఫ్రంట్ ఎలివేషన్) అవసరం. ప్రస్తుతం దీనికోసం అల్యూమినియం కాంపోసైట్ ప్యానెల్ (ఏసీపీ) ఎలివేషన్స్‌ను వాడుతున్నారు. అయితే ఇది కాసింత ఖర్చుతో కూడుకున్న పని. పెపైచ్చు ఏసీపీలతో భవనం లోపల వేడెక్కువగా ఉంటుంది. ఇలాంటి చిక్కులేవీ లేకుండా తక్కువ ఖర్చుతో.. అందంగా, ఆహ్లాదంగా ఉండే ఐక్యూ స్మార్ట్ టైల్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. తెలంగాణలో ఏకైక ఐక్యూ స్మార్ట్ టైల్స్ సప్లయర్ అయిన కాచిగూడలోని హోమ్ 360 డిగ్రీ యజమాని శ్రీనాథ్ రథి ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..

- సాధారణంగా టైల్స్ 11-13 ఎంఎం మందం ఉంటాయి. కానీ ఐక్యూ టోన్ మాత్రం 8 ఎంఎం మాత్రమే ఉంటాయి. గట్టిదనంలో ఏమాత్రం తక్కువ కాదు. వీటిని ఇటాలియన్, స్పెయిన్, చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ప్రస్తుతం భవనాల ఎలివేషన్స్‌కు వాడుతున్న అల్యూమినియం కాంపోసైట్ ప్యానెల్స్ (ఏసీపీ)లకు ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చు. దీంతో భవనం లోపలికి వేడి రాదు. ఫలితంగా ఏసీ, కూలర్‌ల వాడకం తగ్గుతుంది. విద్యుత్ బిల్లు మోత తప్పుతుంది. ఇతర భవనాలతో పోల్చుకుంటే ఐ క్యూ స్మార్ట్ టైల్స్ ఎలివేషన్స్ ఉన్న భవనాల్లో వేడి 20-25 శాతం తక్కువగా ఉంటుంది. ఇవి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను, వేడిని తట్టుకుంటాయి కూడా.
- 13 కిలోల బరువుండే ఈ స్మార్ట్ టైల్స్.. 2 ఎంఎం వరకు ఎటువైపంటే అటువైపు మళ్లుతుంది. దీంతో ఎలివేషన్స్ వాడకంలో వంపులుగా ఉన్న దగ్గర సులువుగా వంగుతాయి. వీటికి మెయింటెనెన్స్ అవసరమూ లేదు. వీటి ధర చ.అ.కు రూ.120-170 వరకు ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కాంటినెంటల్ ఆసుపత్రిలో 6 వేల చ.అ.ల్లో ఫ్రంట్ ఎలివేషన్స్‌కు వీటినే వినియోగిస్తున్నారు.
- క్యూ టోన్ అనే మరో రకం టైల్స్ కూడా ఉన్నాయి. ఇవి అహ్మదాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటాం. వీటి ధరలు వాల్ టైల్స్ అయితే చ.అ.కు రూ.75-300 వరకు, ఫ్లోర్ టైల్స్ అయితే చ.అ.కు రూ.80-200 వరకున్నాయి.
- ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసే స్టోన్ ఆర్ట్ టైల్స్ కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. ఒక్కో గదికి ఒక్కో టైల్స్ వేసుకోవటం ఫ్యాషన్‌గా మారింది కూడా. ఇవి నార్వే, ఇస్తాంబుల్, కెనడా, అమెరికా, ఆఫ్రికా, టర్కీ వంటి సుమారు 20 దేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. అన్నీ ప్రకృతి సిద్ధంగా వచ్చినవే. వీటి ధర చ.అ.కు రూ.600-900 వరకుంటుంది. అన్ని రకాల సైజులుంటాయి.
- స్పానిష్, ఇటాలియన్, చైనా దేశాల టైల్స్‌తో పాటు నిట్కో, సొమానీ, సింపోలో, మోటో వంటి అన్ని బ్రాండ్ల టైల్స్‌ను సరఫరా చేస్తున్నాం. పెద్ద మొత్తంలో కొనుగోళ్లకు విదేశీ టైల్స్ అయితే ఆర్డర్ ఇచ్చిన రోజు నుంచి 45-60 రోజుల్లో, మన దేశ బ్రాండ్లయితే 10 రోజుల్లోపే డెలివరీ చేస్తాం. గతేడాది రూ.12 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. ఈ ఏడాది 30 శాతం వృద్ధి రేటును ఆశిస్తున్నాం.
 
పూర్తిగా గ్లాస్‌తో తయారైన డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ కూడా ఉన్నాయి. 6 ఎంఎం, 8 ఎంఎం మందంతో ఉండి ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఫినిషింగ్ కావటం వీటి ప్రత్యేకత. అంతేకాదు.. మనకు నచ్చిన ఫొటోలు, చిత్రాలను ఈ టైల్స్‌పైన ప్రింట్ చేసుకోవచ్చండోయ్. వీటిని ఎక్కువగా పబ్బులు, రెస్టారెంట్లు, కార్పొరేట్ ఆఫీసుల్లో డెకొరేటివ్ కోసం వాడతుంటారు. ఇంటి విషయానికొస్తే.. చిన్నపిల్లల గ ది, వంట గది, లివింగ్ రూముల్లో ఉపయోగిస్తారు. చిన్న పిల్లల గదుల్లో వాడే ఈ టైల్స్‌పై స్పైడర్ మ్యాన్, చోటా భీం, మిక్కీ మౌస్ వంటి పిల్లలకు ఇష్టమైన బొమ్మలను ముద్రించుకోవచ్చు. అలాగే వంట గదుల్లో అయితే కూరగాయలు, పండ్ల వంటి మనకిష్టమైన ఫొటోలను ప్రింట్ చేసుకోవచ్చు. ఇవి ఢిల్లీ నుంచి దిగుమతి అవుతాయి. అన్ని రకాల రంగుల్లో, సైజుల్లో లభ్యమవుతున్న డీక్రిస్టల్ టైల్స్ ధరలు చ.అ. కు రూ.800-1,600 వరకు ఉంది.

మరిన్ని వార్తలు