యూజర్లకు స్నాప్‌చాట్ క్షమాపణలు

20 Jun, 2020 16:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: స్నాప్‌చాట్‌.. ఈ మెసెంజర్‌ యాప్‌ద్వారా కేవలం మెసేజ్‌లు, కాల్స్‌ మాత్రమే కాకుండా రకరకాల ఫిల్టర్లను ఉపయోగించి వివిధ రకాల ఫోటోలను దిగవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా స్నాప్‌చాట్‌​ యూజర్లకు వివిధ రకాల థిమ్స్‌లో ఫిల్టర్లను అందుబాటులో ఉంచుతుంది. అయితే  మల్టీ మీడియా మెసేంజింగ్‌ యాప్‌ స్నాప్‌చాట్‌ తన యూజర్లకు క్షమాపణలు తెలిపింది. జూన్‌ 19 జూన్టీన్త్‌ డే సందర్భంగా ఒక క్తొత ఫిల్టర్‌ను స్నాప్‌చాట్‌ యూజర్లకు అందుబాటులో ఉంచింది. మనం నవ్వితే సంకెళ్లు తెగుపోతాయి అనే థీమ్‌ను సృష్టించింది. అయితే జూన్టీన్త్‌ డే సందర్భంగా రూపొందించిన ఈ ఫిల్టర్‌కు యూజర్ల నుంచి నెగిటివ్‌ రివ్యూ రావడంతో  స్నాప్‌చాట్‌ క్షమాపణలు చెప్పింది. 

(వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. మల్టీ లాగిన్‌)

‘ఇలాంటి అభ్యంతరకరమైన జూన్టీన్త్‌ లెన్స్‌ రూపొందించినందుకు క్షమాపణలు చెబుతున్నాము. మా రివ్యూ ప్రాసెస్‌లో మేం ఈ లెన్స్‌ వాడకానికి అనుమతి నివ్వలేదు. దీనికి సంబంధి దర్యాప్తు చేస్తున్నాము. మరోసారి ఇలాంటిది పునరావృతం కాదు’ అని ట్విట్టర్‌ వేదికగా క్షమాపణలు కోరింది. అమెరికాలో బానిసలుగా ఉన్న ప్రజల విముక్తి జ్ఞాపకార్థం జూన్ 19న సెలవుదినంగా జరుపుకుంటారు. దీనిని మొదట 1865లో టెక్సాస్‌లో జరుపుకున్నారు. అంతర్యుద్ధం తరువాత 1862 విముక్తి ప్రకటన నిబంధనల ప్రకారం బానిసలకు స్వేచ్ఛగా ప్రకటించారు. దీంతో ప్రతి సంవత్సరం జూన్‌19(జూన్టీన్త్‌ డే)న వేడుకలు చేసుకుంటారు. (ఐటీ చరిత్రలో సంచలన కలయిక)

మరిన్ని వార్తలు