నకిలీ సెగ : బుక్కైన స్నాప్‌డీల్‌ ఫౌండర్స్‌

26 Jul, 2019 08:53 IST|Sakshi

ఆన్‌లైన్‌లో నకిలీ  ప్రొడక్ట్‌ డెలివరీ

స్నాప్‌డీల్‌ ఫౌండర్స్‌పై కేసు

కునాల్‌ బాల్‌, రోహిత్‌ బన్సల్‌పై చీటింగ్‌ కేసు


కోటా : ఆన్‌లైన్ షాపింగ్ సైట్ స్నాప్‌డీల్‌ చిక్కుల్లో పడింది. నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తోందన్నఆరోపణల నేపథ్యంలో కంపెనీ ఫౌండర్స్‌ అడ్డంగా  బుక్కయ్యారు. రాజస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త ఇందర్‌మోహన్ సింగ్ హనీ ఫిర్యాదు మేరకు స్నాప్‌డీల్‌ సీఈవో కునాల్ బాల్, సీవోవో రోహిత్ బన్సల్ చీటింగ్‌ కేసు నమోదైంది. 

 వ్యాపారవేత్త ఇంద్రమోహన్‌ సింగ్‌ హనీ జూలై 17న   ఉడ్‌ ల్యాండ్‌ బెల్ట్‌, వాలెట్‌ లను స్నాప్‌డీల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్‌ చేశాడు. ఈ బ్రాండెడ్‌ వస్తువులకు బదులుగా, నకిలీ వస్తువులు చేరడంతో, వాటిని ఉడ్‌ల్యాండ్‌ షోరూంకి వెళ్లి ఎంక్వయిరీ చేశాడు. అవి నకిలీవని ఉడ్‌ల్యాండ్‌ సిబ్బంది కూడా ధృవీకరించారు. దీంతో స్థానిక గుమన్‌పురా స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు కూడా ఇలాంటి  అనుభవమే ఎదురైందని ఆయన ఆరోపిస్తున్నారు.  చేతి గడియారాన్ని  ఆర్డర్‌  చేశా...డెలివరీ చేశామని కంపెనీ నుంచి మెసేజ్‌ వచ్చింది కానీ వాచ్‌ ఇంటికి చేరలేదని తెలిపారు. అయితే కంపెనీకి ఫిర్యాదు  చేయడంతో  తన డబ్బులను రిఫండ్‌ చేసిందంటూ గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఇంద్రమోహన్‌ ఫిర్యాదు ఆదారంగా   సెక్షన్ 420 కింద  కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి మనోజ్ సింగ్ సికార్వాల్ తెలిపారు.

 చదవండి :  స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మరిన్ని వార్తలు