స్నాప్‌డీల్‌లో రూ.3,269 కోట్ల తాజా పెట్టుబడులు

19 Aug, 2015 02:35 IST|Sakshi
స్నాప్‌డీల్‌లో రూ.3,269 కోట్ల తాజా పెట్టుబడులు

సాఫ్ట్‌బ్యాంక్, ఆలీబాబా, ఫాక్స్‌కాన్ నుంచి నిధులు
న్యూఢిల్లీ:
ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్ తాజాగా 50 కోట్ల డాలర్లు(రూ.3,269 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. చైనాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా, తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ఫాక్స్‌కాన్, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ల నుంచి ఈ నిధులు సమీకరించామని స్నాప్‌డీల్ తెలి పింది. ఇప్పటికే తమ సంస్థలో ఇన్వెస్ట్ చేసిన టిమసెక్, బ్లాక్‌రాక్, మైరాయిడ్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ల నుంచి కూడా ఈ తాజా రౌండ్ నిధుల సమీకరణలో పెట్టుబడులు వచ్చాయని స్నాప్‌డీల్ సీఈఓ, వ్యవస్థాపకుల్లో ఒకరైన కునాల్ బహాల్ చెప్పారు. 

ఇప్పటికే ఈ సంస్థ వంద కోట్ల డాలర్లుకు పైగా పెట్టుబడులను సాఫ్ట్‌బాంక్(62.7 కోట్ల డాలర్లు), పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాల నుంచి రాబట్టింది. కాగా పెట్టుబడి వివరాలను స్నాప్‌డీల్ వెల్లడించలేదు. అయితే ఫాక్స్‌కాన్‌కు చెందిన ఎఫ్‌ఐహెచ్ మొబైల్ సంస్థ స్నాప్‌డీల్‌లో 4.27 శాతం వాటాను 20 కోట్ల డాలర్లకు కొనుగోలు చేశామని పేర్కొంది. ఈ లెక్కన స్నాప్‌డీల్ విలువ 400-500కోట్ల డాలర్లు(రూ.25,200-31,500 కోట్లు) ఉంటుందని అంచనా.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా