నకిలీ ఉత్పత్తులకు స్నాప్‌డీల్‌ చెక్‌.. 

27 Nov, 2018 00:58 IST|Sakshi

‘బ్రాండ్‌ షీల్డ్‌’ విధానం అమలు

న్యూఢిల్లీ: నకిలీ ఉత్పత్తుల విషయంలో ప్రముఖ బ్రాండ్స్‌ అప్రమత్తంగా వ్యవహరించేలా తోడ్పడేందుకు ఈ–కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ తాజాగా ‘బ్రాండ్‌ షీల్డ్‌’ పేరిట ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. వివిధ బ్రాండ్స్‌ నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. స్నాప్‌డీల్‌లో అమ్ముడయ్యే నకిలీ ఉత్పత్తులపై ఆయా బ్రాండ్స్‌ ఫిర్యాదు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది. ట్రేడ్‌మార్క్, కాపీరైట్, పేటెంట్, డిజైన్‌పరంగా జరిగే మేథోహక్కుల ఉల్లంఘనలను బ్రాండ్‌ షీల్డ్‌ విధానం కింద సదరు సంస్థలు ఫిర్యాదు చేయొచ్చని స్నాప్‌డీల్‌ తెలిపింది.  

మరిన్ని వార్తలు