ఎయిర్‌టెల్‌పై సాఫ్ట్‌బ్యాంక్‌ కన్ను

12 Aug, 2019 09:51 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌లో వాటా కొనుగోలుకు జపాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్‌ ఆసక్తి కనబరుస్తోంది. భారతి ఎయిర్‌టెల్‌ టెలికాం బిజినెస్‌, సంబంధిత ఆస్తుల్లో నేరుగా వాటా కొనుగోలుకు లేదా హోల్డింగ్‌ కంపెనీ ద్వారా ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంపై సాఫ్ట్‌బ్యాంక్‌ ముమ్మరంగా చర్చిస్తోంది. ఎయిర్‌టెల్‌కు చెందిన ఇతర టెలికాం మౌలిక వసతులు, సేవల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు సాఫ్ట్‌బ్యాంక్‌ సంప్రదింపులు జరుపుతోంది.

ఎయిర్‌టెల్‌లో ఎంతమేర వాటా కొనుగోలుకు సాఫ్ట్‌బ్యాంక్‌ ప్రతిపాదిస్తోందన్న వివరాలు వెల్లడికాలేదు. చర్చలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయని విక్రయ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంపై ఎయిర్‌టెల్‌ ప్రతినిధులతో సాప్ట్‌బ్యాంక్‌ విస్తృత సంప్రదింపులు కొనసాగుతున్నాయని సమాచారం.

మరిన్ని వార్తలు