అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌

25 Jul, 2018 17:15 IST|Sakshi
సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌2 స్మార్ట్‌ఫోన్‌

న్యూఢిల్లీ : జపాన్‌కు చెందిన మొబైల్‌ తయారీదారి సోనీ, తన ఎక్స్‌పీరియా రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్లను విస్తరిస్తూ వెళ్తోంది. తాజాగా ఎక్స్‌పీరియా రేంజ్‌లో ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌2 పేరుతో ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ నూతన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలో తొలి 4కే హెచ్‌డీఆర్‌ మూవీ రికార్డింగ్‌ ఫీచర్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. దీని ధర 72,990 రూపాయలు. ఇదే కంపెనీ ఇప్పటి వరకు భారత్‌లో లాంచ్‌ చేసిన అత్యంత ఖరీదైన సోనీ స్మార్ట్‌ఫోన్‌. ఆగస్టు 1 నుంచి ఎంపిక చేసిన సోనీ సెంటర్‌, ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. 

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌2 స్పెషిఫికేషన్లు..
5.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 5
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌
డ్యూయల్‌ సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌
ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
6 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
400 జీబీ వరకు విస్తరణ మెమరీ
19 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
3180 ఎంఏహెచ్‌ బ్యాటరీ
క్వాల్‌కామ్‌ క్విక్‌ ఛార్జ్‌ 3.0
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, గూగుల్‌ కాస్ట్‌
 IP65/IP68 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌ సర్టిఫైడ్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు