సోనీ నుంచి ‘సెల్ఫీ’ మొబైల్

26 Aug, 2014 00:54 IST|Sakshi
సోనీ నుంచి ‘సెల్ఫీ’ మొబైల్

 న్యూఢిల్లీ: సెల్ఫీ క్రేజ్ జోరుగా ఉన్న నేపథ్యంలో సెల్ఫీ ప్రియుల కోసం సోనీ కంపెనీ సరికొత్త సెల్ఫీ స్మార్ట్‌ఫోన్, ఎక్స్‌పీరియా సీ3ను సోమవారం ఆవిష్కరించింది. సెల్ఫీ కెమెరా యాప్స్‌తో లభించే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ధర రూ.23,990 అని కంపెనీ పేర్కొంది.  

ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 5.5 అంగుళాల స్క్రీన్, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్-కోర్ 1.2 గిగా హెట్జ్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది. వచ్చే నెల 1 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రారంభిస్తామని సోనీ వివరించింది.

 సెల్ఫీ స్పెషల్స్: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయని సోనీ కంపెనీ పేర్కొంది. సూపీరియర్ ఆటో, పోర్ట్రెయిట్ రీటచ్ వీ.2, పిక్చర్ ఎఫెక్ట్స్(ఇవి రెండూ ఫొటో ఎడిటింగ్ ఫీచర్స్) సోషల్ లైవ్, స్వీప్ పనోరమ వంటి కెమెరా ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ ప్రత్యేకతల్లో  పీఆర్‌ఓ సెల్ఫీ క్యామ్ ఒకటని కంపెనీ పేర్కొంది.

మరిన్ని వార్తలు