తాగి డ్రైవ్ చేస్తే.. ఇన్సూరెన్స్ గోవింద

8 Apr, 2017 15:30 IST|Sakshi
తాగి డ్రైవ్ చేస్తే.. ఇన్సూరెన్స్ గోవింద
న్యూఢిల్లీ : తప్ప తాగి రోడ్డు ప్రమాదాలు చేస్తున్న వారిపై మరింత కఠినంగా వ్యవహారించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోంది. డ్రంక్ డ్రైవర్లకు మరింత షాకిచ్చేలా రోడ్డు ప్రమాదంలో ఎవరికైనా హాని కలుగజేస్తే, వారికి పూర్తి నష్టపరిహారం డ్రైవర్లే చెల్లించేలా ప్రభుత్వం చట్టాన్ని సవరణ చేస్తోంది.  దీనికి సంబంధించిన మోటార్ వెహికిల్స్(సవరణ) బిల్లును కేంద్రప్రభుత్వం శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టింది. మద్యం సేవించి డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలు చేపడితే, ఆ కేసులకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలాంటి నష్టపరిహారాలు చెల్లించవని మోటార్స్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం రోడ్డు ప్రమాదాలు చేపట్టే డ్రంక్ డ్రైవర్లే మొత్తం నష్టపరిహారాలను భరించేలా బిల్లు ప్రతిపాదించింది.
 
అంతేకాక ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదం హత్య కాదనే ప్రొవిజన్ ను రోడ్డు రవాణా మంత్రి ఈ బిల్లులో చేర్చలేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు చేసిన డ్రంకెన్ డ్రైవర్లకు నాన్-బెయిలబుల్ నేరం, 10 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేయనున్నారు. పార్లమెంటరీ ప్యానల్ లో ఈ ప్రతిపాదనను రోడ్డు రవాణామంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఇండియన్ పీనల్ కోడ్ లో సవరణల కోసం హోం మంత్రిత్వశాఖ ముందుకు దీన్ని పంపించారు. పరిహారాలను మొత్తం రోడ్డు ప్రమాదాలు గురిచేసిన వారే కట్టాలని పేర్కొనడం చాలా ప్రతిబంధకంగా ఉందని, డ్రైవర్ చెల్లించే సామర్థ్యత, ఆదాయం బట్టి పరిహారం చెల్లించేలా చట్టాన్ని సవరణ చేయాలని మరోవైపు నుంచి నిపుణులు వాదిస్తున్నారు.
 
డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులకు నష్టపరిహారాలు మొత్తాన్ని డ్రైవర్లే భరించాలని ప్రతిపాదించడం పరోక్షంగా ఇన్సూరెన్స్ కంపెనీలు మేలు చేకూర్చడమేనని పేర్కొంటున్నారు.  డ్రంక్ డ్రైవర్ రోడ్డు ప్రమాదాలకు గురిచేయడం ప్రభుత్వ అథారిటీల లోపం కిందకు కూడా వస్తుందని చెబుతున్నారు. అయితే ఈ బిల్లుతో సగం వరకు రోడ్డు ప్రమాదాలను నిర్మూలించవచ్చని రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరి చెప్పారు.  రెగ్యులేటింగ్ ట్యాక్సీ అగ్రిగేటర్లకు కూడా ఈ బిల్లు వర్తిస్తుందని పేర్కొన్నారు. తప్పుడు దరఖాస్తులు సమర్పించి రిజిస్ట్రేషన్ పొందినా వెహికిల్ ఓనర్, డీలర్ కు లక్ష రూపాయల వరకు పెనాల్టి వేయాలని కూడా మంత్రి ప్రతిపాదించారు.  
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా