ఇక ట్విట్టర్ ద్వారానూ నగదు బదిలీ

13 Oct, 2014 12:11 IST|Sakshi
ఇక ట్విట్టర్ ద్వారానూ నగదు బదిలీ

డబ్బులు ఒకచోటు నుంచి మరో చోటికి పంపడం ఇప్పుడు చాలా రకాలుగా సులభం అవుతోంది. ఇప్పుడు ఇందుకు మరో సాధనం లభించింది. ట్విట్టర్ ద్వారా డబ్బులు పంపేందుకు త్వరలోనే వీలు కుదరబోతోంది. ఇందుకోసం ఫ్రాన్స్లోని ఓ పెద్ద బ్యాంకు ఈ మైక్రో బ్లాగింగ్ సైట్తో జత కలుస్తోంది. ఇది పూర్తయితే.. ఇక ట్వీట్స్ ద్వారా కూడా డబ్బులు పంపుకోవచ్చు. బీపీసీఈ అనే ఈ బ్యాంకు ఫ్రాన్సులోనే రెండో అతి పెద్దది. కేవలం ప్రకటనల ద్వారా మాత్రమే కాక.. మిగిలిన మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదించాలన్న ట్విట్టర్ ఆలోచనలకు ఈ బ్యాంకు మార్గం చూపించింది.

మొబైల్ ఫోన్లు, యాప్ ద్వారా డబ్బు పంపే విధానంలో ఫేస్బుక్ లాంటి దిగ్గజాలతో ట్విట్టర్ పోటీపడుతోంది. దీంతో కొన్ని దశాబ్దాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తున్న బ్యాంకులు ఇప్పుడు జనం లేక ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి వచ్చినా రావచ్చని అంటున్నారు. ఇక ఫ్రెంచి పౌరులు కొత్త పద్ధతిలో డబ్బు పంపుకోవచ్చని బ్యాంకు అధికారులు తెలిపారు. ఇక వాళ్లకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా కూడా.. లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా వివరాలు లేకపోయినా కూడా.. అవతలి వాళ్ల ట్విట్టర్ అకౌంట్ వివరాలుంటే చాలని, సింపుల్గా ఓ ట్వీట్ ద్వారానే డబ్బు పంపొచ్చని చెప్పారు.

మరిన్ని వార్తలు