గోల్డ్ బాండ్ ట్రేడింగ్ శుభారంభం

14 Jun, 2016 01:19 IST|Sakshi
గోల్డ్ బాండ్ ట్రేడింగ్ శుభారంభం

ముంబై: స్టాక్ ఎక్స్చేంజ్‌ల్లో గోల్డ్ బాండ్ల ట్రేడింగ్ సోమవారం శుభారంభం చేసింది. ట్రేడింగ్ తొలి రోజే 7 శాతం లాభాలు వచ్చాయి. గ్రామ్ డినామినేషన్ గోల్డ్ బాండ్ రూ.2,930 వద్ద నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ)లో లిస్ట్ అయింది. 7.43 శాతం లాభంతో రూ.3,147.75 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 10.3 శాతం లాభంతో రూ.3,258 గరిష్ట స్థాయిని తాకింది. 736 లావాదేవీలు జరిగాయి. టర్నోవర్ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి రూ.23.18 లక్షలుగా నమోదైంది. భౌతికంగా బంగారాన్ని కొనకపోయినప్పటికీ, ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేసుకోవడానికి సావరిన్ గోల్డ్ బాండ్స్ వీలు కల్పిస్తాయి. గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 30న ప్రారంభించింది.

మరిన్ని వార్తలు