నీరవ్‌ మోడీకి షాకిచ్చిన ప్రత్యేక న్యాయస్థానం

8 Jun, 2020 20:30 IST|Sakshi

న్యూఢిల్లీ:​​​​​ దేశీయ బ్యాంక్‌(పీఎన్‌బీ)ను మోసం చేసి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి ప్రత్యేక న్యాయస్థానం షాకిచ్చింది. దేశ వ్యాప్తంగా నీరవ్ మోడీకి చెందిన రూ.1,400 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ, ఐటీ జప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అయితే ఆస్తులను జప్తు చేసే ముందు నీరవ్‌ మోడీకి అప్పీలు చేయడానికి 30 రోజుల సమయం ఇవ్వాలని కోర్టు తెలిపింది. పంజాబ్‌ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)కు వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో నీరవ్‌ మోడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్‌లో ఉంటున్నారు. భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై గత ఏడాది లండన్ కోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతం నీరవ్‌ మోడీ లండన్‌‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పీఎన్‌బీని రూ.13,600 కోట్ల మేర మోసగించిన కేసులో నీరవ్‌ మోడీని కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. చదవండి: బెదిరిస్తున్న నీరవ్‌ మోదీ

మరిన్ని వార్తలు