‘పన్ను’కు విరుగుడు పొదుపే!!

7 Aug, 2016 23:17 IST|Sakshi
‘పన్ను’కు విరుగుడు పొదుపే!!

ఇన్వెస్ట్‌మెంట్‌కు ఏడాది మొత్తం గడువు   
ఆఖరు నిమిషంలో హడావుడి పడితే మొదటికే మోసం
మొదట అవగాహన; ఆ తరవాతే సాధనం ఎంపిక 
కొన్ని జాగ్రత్తలు పాటిస్తే గరిష్టంగా పన్ను ప్రయోజనం

రిటర్నుల దాఖలుకు ఆఖరి రోజులివి. మామూలుగా అయితే ఈ సమయానికి గడువు ముగిసిపోయేది. కాకపోతే ఐటీ విభాగం గడువును ఇంకో ఐదు రోజులు పొడిగించింది. నిజానికి చాలామంది రిటర్నులు ఇప్పటికే దాఖలు చేసేశారు. మరికొందరు ‘ఆఖరి నిమిషం’ వ్యక్తులు మాత్రం... గడువు పొడిగించటంతో హమ్మయ్య అంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి వాళ్లు కూడా అప్పటివరకూ రిటర్నులు వేసేద్దామని రోజూ అనుకుంటూనే ఉంటారు. కానీ వేసేది మాత్రం చివర్లోనే. ఒక్కటి గుర్తుంచుకుంటే... పన్ను ఆదా చెయ్యటానికి పూర్తి ఏడాది సమయం ఉంటుంది. మరి దాన్నెందుకు ఉపయోగించుకోకూడదు? ఆఖరి నిమిషం వరకూ వాయిదా వెయ్యటమెందుకు? ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే కాస్త ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేమా..? అలా చేసి గరిష్టంగా పన్ను ప్రయోజనాలు పొందలేమా? అదెలాగో చూద్దాం...

సాధనాలను పరిశీలించాలి..
పైన చెప్పినవన్నీ తెలుసుకున్నాక... పన్ను ఆదా చేసుకునేందుకు ఏం చేయాలన్నది చూడాలి. అందుబాటులో ఉన్న సాధనాల్ని పరిశీలించాలి. ప్రతిదాన్లో అనుకూల, ప్రతికూల అంశాలుంటాయి. వాటిని బేరీజు వేసుకోవాలి. మీ రిస్కు సామర్థ్యంపై మీకు అవగాహన ఉంటే నిర్దిష్ట సాధనాన్ని ఎంచుకోవడం సులభమవుతుంది. ఏ సాధనాన్ని ఎలా ఉపయోగించుకుంటే గరిష్టంగా పన్ను భారాన్ని తగ్గించుకోగలమనేది తెలిస్తే అత్యధిక ప్రయోజనాలు పొందటం వీలవుతుంది.

 వ్యూహం వేశాకే ఇన్వెస్ట్‌మెంట్...
అందుబాటులో ఉన్న పెట్టు బడి సాధనాలన్నింటినీ పరిశీలించాక ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా పెట్టుబడి వ్యూహాన్ని రూపొందించాలి. ఈ వ్యూహం ఎలా ఉండాలంటే..

పన్ను ఆదా చేసే డెట్, ఈక్విటీ సాధనాలు రెండింటి మేళవింపుగా ఉండాలి

ఆర్థికపరమైన బాధ్యతలను నెరవేర్చేందుకు తగినంత కవరేజీ ఉండేలా బీమాకు ప్రాధాన్యమివ్వాలి

మీ వ్యూహం దీర్ఘకాలం నిలకడగా కొనసాగించగలిగేదిగా ఉండాలి. ఆదాయంలో 75 శాతం పొదుపునకు కేటాయించేసి... దాంతోనే అన్ని అవసరాలూ తీరాలనుకుంటే కుదరదు.

దీర్ఘకాలికంగా అవసరాలు తలెత్తినప్పుడు మెచ్యూరిటీ మొత్తాలు చేతికి అందివచ్చేలా ఉండాలి. ఇలాంటి లాకిన్ పీరియడ్ ఉన్న సాధనాలు చూసుకోవాలి.

పెట్టుబడులు ఆశించిన పనితీరు కనబరచని పక్షంలో అవసరమైతే మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటునిచ్చేలా వ్యూహం ఉండాలి.
అన్నింటికన్నా ముందు తెలుసుకోవాల్సిందేమిటంటే...

{పణాళికలేమీ లేకపోతే పన్ను భారం ఎంత పడుతుంది? పొదుపు పెట్ట్టుబడులతో ముందుకెళితే ఎంత పన్ను కట్టాలి?

అందుబాటులో ఉన్న వివిధ పన్ను ప్రణాళిక సాధనాలేంటి?

అసలు మన పొదుపు సామర్థ్యమెంత? నెలవారీ ఖర్చులు పోనూ మిగిలేదెంత?

గరిష్టంగా పన్ను ప్రయోజనాలు పొందాలంటే ఎంత పొదుపు చెయ్యాలి?

రాబోయే ఆర్థిక సంవత్సరం వచ్చే పెద్ద పెద్ద ఖర్చులేంటి?

ఏడాది మొత్తం ఖర్చులు, పెట్టుబడులు ఎలా ఉండబోతున్నాయి?

ఇవన్నీ తెలుసుకున్నాక అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవాలి.


 

>
మరిన్ని వార్తలు