రూ. 1.02 లక్షల కోట్లకు స్పెక్ట్రం బిడ్లు

15 Mar, 2015 02:01 IST|Sakshi
రూ. 1.02 లక్షల కోట్లకు స్పెక్ట్రం బిడ్లు

న్యూఢిల్లీ: టెలికం స్పెక్ట్రం వేలం పదో రోజున బిడ్లు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ముగింపు స్థాయి రూ. 1,01,432 కోట్ల నుంచి శనివారం రూ. 1,02,215 కోట్లకు చేరాయి. ఇప్పటిదాకా 61 రౌండ్లు జరగ్గా, అమ్మకానికి ఉంచిన స్పెక్ట్రంలో సుమారు 87 శాతాన్ని టెల్కోలు దక్కించుకున్నాయి. ఇంకా కొంత స్పెక్ట్రం మిగిలిపోయి ఉన్నందున సోమవారం కూడా వేలం కొనసాగనుంది.

2జీ, 3జీ సర్వీసులకు ఉపయోగపడే నాలుగు ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలోనూ స్పెక్ట్రంను దక్కించుకునేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయని టెలికం శాఖ వర్గాలు తెలిపాయి. అయితే, 3జీ సేవలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సహా ముంబై, ఢిల్లీ సర్కిళ్లలో బిడ్లు రాలేదని వివరించాయి. 800 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌కి ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌తో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర సర్కిళ్లలో డిమాండ్ నెలకొంది.

>
మరిన్ని వార్తలు