స్పెన్సర్స్‌ గూటికి గోద్రెజ్‌ నేచర్స్‌ బాస్కెట్‌ 

18 May, 2019 00:24 IST|Sakshi

న్యూఢిల్లీ: సంజీవ్‌ గోయంకా గ్రూపులో భాగమైన స్పెన్సర్స్‌ రిటైల్, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్‌ గ్రోసరీ సంస్థ నేచర్స్‌ బాస్కెట్‌ను కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ రూ.300 కోట్లు. ఈ కొనుగోలు ద్వారా స్పెన్సర్స్‌ రిటైల్‌ దేశవ్యాప్త కార్యకలాపాలు కలిగిన సంస్థగా మారుతుంది. ముంబై, పుణే, బెంగళూరులోని ప్రధాన ప్రాంతాల్లో 36 స్టోర్లతోపాటు పశ్చిమాదిన స్పెన్సర్స్‌కు నెట్‌వర్క్‌ లభిస్తుంది. గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ సబ్సిడరీ గోద్రెజ్‌ నేచర్స్‌ బాస్కెట్‌లో నూరు శాతం వాటాను (44,58,30,000 షేర్లు) కొనుగోలు చేసే ప్రతిపాదనకు స్పెన్సర్స్‌ రిటైల్‌ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది.


వాటాదారులు, నియంత్రణ సంస్థల ఆమోదంపై ఇది ఆధారపడి ఉంటుందని స్పెన్సర్స్‌ రిటైల్‌ తెలిపింది. నేచర్స్‌ బాస్కెట్‌ 2018–19 సంవత్సరంలో రూ.338 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఆహార, పానీయాలు, గ్రోసరీ వస్తువులను విక్రయిస్తుంటుంది.   

మరిన్ని వార్తలు