జెట్‌ ఎయిర్‌వేస్‌ ఎఫెక్ట్ ‌: స్పైస్‌జెట్‌ రికార్డ్‌ లాభాలు

9 Aug, 2019 19:19 IST|Sakshi

సాక్షి, ముంబై : భారతీయ బడ్జెట్ విమానయాన సంస్థ  స్పైస్‌జెట్‌  లిమిటెడ్  అనూహ్య లాభాలను సాధించింది. ప్రధానంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్థిక సంక్షోభం, సేవలు నిలిపివేత  లాంటివి స్పైస్‌ జెట్‌ కు బాగా కలిసి వచ్చాయి.  ఆర్థిక మందగమనం, దేశీయంగా  డిమాండ్‌ క్షీణిస్తున్నప్పటికీ  లాభాల్లో విశ్లేషకుల అంచనాలను బీట్‌ చేసింది. ఉదాహరణకు, ఎడెల్విస్ సెక్యూరిటీస్ 154 కోట్ల రూపాయల లాభం ఆర్జిస్తుందని  అంచనా వేసింది. జూన్ త్రైమాసికంలో(క్యూ 1)  రూ. 262  కోట్ల  నికర లాభాలను సాధించింది. ఏడాది క్రితం  ఇదే క్వార్టర్‌లో  38.1 కోట్ల నష్టాన్ని నమోదు  చేసింది.

ఆదాయం ఏకంగా 35 శాతం ఎగిసింది. మొత్తం ఆదాయం జూన్ 2019తో ముగిసిన త్రైమాసికంలో 3,145.3 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ.2,253.3 కోట్లు.  ఆపరేటింగ్‌ ఆదాయం 3002 కోట్లుగా ఉంది.  గత ఏడాది ఇదే క్వార్టర్‌లో 2204 కోట్లుగా ఉంది.  గత ఏడాది రూ. 32.89తో  పోలిస్తే  క్యూ 1లో  రూ. 143.2 కోట్ల ఇతర ఆదాయాన్ని నమోదు చేసింది.

గత మూడు నెలల కాలంలో ప్రయాణీకుల ఛార్జీలు11 శాతం పెరిగాయని స్పైస్ జెట్ తెలిపింది. మార్చిలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం  కుప్పకూలిన తరువాత బోయింగ్ 737 మాక్స్  విమానాలను రద్దు చేయడంతో  ఈ త్రైమాసికంలో కొంత ఒత్తిడిని  ఎదుర్కొన్నామని, లేదంటే ఫలితాలు  ఇంకా బావుండేవని  స్పైస్‌జెట్‌  చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా