ముంబై మెట్రోకు ‘శ్రీసిటీ’ బోగీలు

11 Dec, 2019 00:48 IST|Sakshi
మెట్రో రైలు బోగీల తయారీ పనుల ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తున్న ఆల్‌స్టామ్‌ ఇండియా ఎండీ అలెన్‌ స్ప్యార్‌ 

తయారీ ప్రారంభించిన ఆల్‌స్టామ్‌

వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): ముంబై మెట్రో లైన్‌–3 ప్రాజెక్టుకు శ్రీసిటీలో ఆల్‌స్టామ్‌ పరిశ్రమ ఉత్పత్తి చేస్తున్న రైలు బోగీలను వాడనున్నారు. ఈ మేరకు మెట్రో ప్రాజెక్టుతో ఒప్పందం కుదిరినట్లు ఆల్‌స్టామ్‌ ఇండియా, దక్షిణాసియా ఎండీ అలెన్‌ స్ప్యార్‌ చెప్పారు. నిర్ధేశిత సమయంలో 8 బోగీలుండే 31 ట్రైన్‌ సెట్‌లను అందజేస్తామని, వీటి తయారీని కూడా ఆరంభించామని అలెన్‌ స్ప్యార్‌ చెప్పారు.

శ్రీసిటీ ప్లాంట్‌లో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 240 నుంచి 480 రైళ్లకు చేర్చేందుకు తాము శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ చెన్నై మెట్రో, మాంట్రియల్‌ మెట్రో(కెనడా), ముంబై మెట్రో లైన్‌–3 ఆర్డర్లకు అనుగుణంగా ఉత్పత్తి జరుగుతోందన్నారు. సిడ్నీకి చెందిన మరో ప్రాజెక్టు ఒప్పందం కూడా జరిగిందని తెలియజేశారు.

మరిన్ని వార్తలు