ఫ్లిప్‌కార్ట్‌కు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై

5 May, 2020 12:07 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్కు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. దీంతో సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా శ్రీరామ్ వెంకటరమణను నియమించినట్లు వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ మంగళవారం  ప్రకటించింది.  ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది.  (లాక్‌డౌన్‌ 3.0 : ఈ కామర్స్ కంపెనీలకు ఊరట)

సెప్టెంబర్ 2018 నుండి ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఎఫ్‌ఓగా ఉన్న ఎమిలీ మెక్‌నీల్‌ తన పదవికి రాజీనామా చేశారు. వాల్‌మార్ట్ గ్రూప్ వెలుపల  మెరుగైన కెరీర్ అవకాశాల కోసం అమెరికాకు తిరిగి  వెళ్లాలని  నిర్ణయించుకున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో తాజా పరిణామం చోటుకుంది. ఫ్లిప్‌కార్ట్‌లో  సీఎఫ్ఓ, సీవోవోగా పనిచేసిన వెంకట రమణ ఇప్పుడు వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఎఫ్ఓక్రిస్ నికోలస్‌కు  రిపోర్టు చేయాల్సి  వుంటుంది.  ఫ్లిప్‌కార్ట్ కామర్స్ (ఫ్లిప్‌కార్ట్, మింత్రా) సీఎఫ్ఓ శ్రీరామ్  పన్ను, రిస్క్ మేనేజ్‌మెంట్,  ట్రెజరీతో సహా ఫ్లిప్‌కార్ట్, మింత్రాకు సంబంధించి కీలకమైన ఫైనాన్స్ కార్యకలాపాలు  బాధ్యతలను  నిర్వహించనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో కార్పొరేట్ అభివృద్ధికి కూడా ఆయన బాధ్యత వహిస్తారని, ప్రొక్యూర్‌మెంట్, ప్లానింగ్ అండ్ ఎనలిటిక్స్ అండ్ డెసిషన్ సైన్సెస్ హెడ్‌లు ఆయనకు రిపోర్ట్ చేస్తూనే ఉంటారని  ఫ్లిప్‌కార్ట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  (పెట్రో ధరలకు వ్యాట్ షాక్ )

ఫ్లిప్‌కార్ట్‌లో అనేక కీలకమైన బాధ్యతలను విజయవంతంగా  నిర్వహించిన శ్రీరామ్ ఫ్లిప్‌కార్ట్ కామర్స్ సీఎఫ్‌ఓగా బాధ్యతలు స్వీకరించడానికి బాగా సిద్ధంగా ఉన్నారని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అలాగే చక్కని నాయకత్వం, మార్గదర్శకత్వంలో సమర్ధవంతమైన సేవలు అందించిన ఎమిలీ కు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్యాణ్ కృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.  హైపర్‌లోకల్ ఫ్రెష్ ఫుడ్ సామర్థ్యాలను పెంపొందించే కీలకమైన పెట్టుబడులను నడిపించడంలో మెక్‌నీల్ కీలకపాత్ర పోషించారని, సంస్థ ప్రయాణంలో బలమైన భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. (లాక్‌డౌన్‌ సడలింపు : పసిడి వెలవెల)

మరిన్ని వార్తలు