హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీలో వాటా విక్రయం

17 Jun, 2020 12:06 IST|Sakshi

ఆఫర్‌​ఫర్‌ సేల్‌ పద్ధతిలో 60లక్షల ఈక్విటీ షేర్ల విక్రయం

ఫ్లోర్‌ ధర రూ.రూ.2,362గా నిర్ణయం

హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో వాటాను ప్రమోటర్‌ సంస్థలో ఒకటైన స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ విక్రయించనుంది. ఆఫర్ ఫర్‌ సేల్‌ పద్ధతిలో బుధ, గురువారాల్లో మొత్తం 2.82శాతం వాటాకు సమానమైన 60లక్షల ఈక్విటీ షేర్ల అమ్మకానికి సిద్ధమైంది. ఈ ఆఫర్‌ ఫర్‌ సేల్‌కు ఫ్లోర్‌ ధర రూ.2,362గా నిర్ణయించింది. ఈ  విక్రయం ద్వారా స్టాండర్డ్‌ లైఫ్‌ మొత్తం రూ.1417 కోట్లను సమీకరించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో మార్చి 31 నాటికి స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీలకు విడివిడిగా 26.89శాతం వాటాను కలిగి ఉన్నాయి. 

‘‘డిమాండ్‌కు అనుగుణంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ఇష్యూ ద్వారా ప్రమోటర్‌ సంస్థ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ జూన్‌ 17-18తేదిల్లో మొత్తం 1.12 కోట్ల ఈక్విటీ షేర్లకు సమానమైన మొత్తం 5.64శాతం వాటాను ను విక్రయించనుంది. ఈ మొత్తం విక్రయంలో తొలుత 2.82శాతం వాటాను సమానమైన 60లక్షల షేర్లకు విక్రయించనుంది. తదుపరి డిమాండ్‌ అనుగుణంగా మరో 2.82శాతం వాటాను సైతం విక్రయించనుంది.’’ అని హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.

వాటా విక్రయ నేపథ్యంలో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌మేనేజ్‌మెంట్‌  నిన్నటి ముగింపు(రూ.2537.65)తో పోలిస్తే 2.50శాతం నష్టంతో రూ.2477 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1784.15లు, రూ.3844.00గా నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు