10నెలల్లో  తొలిసారి: ఎస్‌బీఐ  శుభవార్త

31 Oct, 2017 19:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  గృహకొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. గృహ రుణాల వడ్డీరేట్లను  తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 
మంగళవారం జారీ చేసిన ప్రకటనలో మార్జినల్‌కాస్ట్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) 5 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.  ఇది  రేపటి నుంచే (బుధవారం) అమల్లోకి వస్తాయని తెలిపింది.  10 నెలల్లో దాని మొట్టమొదటి రుణ రేటు తగ్గింపుగా నిలిచింది.  వార్షిక  ఎంసీఎల్‌ఆర్ ను 7.95 శాతానికి  దిగి వచ్చింది. ఇప్పటివరకు 8 శాతంగా ఉంది. 

మరిన్ని వార్తలు