డిపాజిట్ల రేటును  తగ్గించిన ఎస్‌బీఐ 

9 Mar, 2019 00:43 IST|Sakshi

ముంబై: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. పొదుపు ఖాతాలు, స్వల్పకాలిక రుణ రేట్లను రెపోరేటుకు అనుసంధానం చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. తొలిసారిగా ఎక్స్‌టర్నల్‌ ప్రమాణిక వడ్డీరేట్లకు కలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన రేట్లు మే 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 7న రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి తీసుకొచ్చింది. రూ.లక్ష పైబడిన సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్లపై ప్రస్తుతం ఏడాదికి 3.50 శాతం రేటు ఉండగా.. ఇది రెపోరేటు కంటే 2.75 శాతం తక్కువగా ఉందని తెలిపింది. క్యాష్‌ క్రెడిట్‌ అకౌంట్స్, రూ.లక్ష దాటిన ఓవర్‌డ్రాఫ్ట్‌ను రెపోరేటు, 2.25 శాతం జోడించి అనుసంధానం ఉంటుందని వివరించింది.    

మరిన్ని వార్తలు