ఏపీకి రూ.34వేల కోట్లు.. తెలంగాణకు 19వేల కోట్లు

1 Feb, 2018 18:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పన్నుల్లో వాటాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 2018-19వ సంవత్సరానికి రూ. 33,929.84 కోట్లు దక్కనున్నాయి. ఇక తెలంగాణకు రూ. 19,207.43 కోట్లు కేంద్రం ఇవ్వనుంది. ప్రతి ఏడాది రాష్ట్రాల నుంచి వసూలైన కేంద్ర పన్నుల మొత్తంలో ఆయా రాష్ట్రాల వాటాను కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వనున్న సంగతి తెలిసిందే.  ఈ మేరకు రాష్ట్రాలకు దక్కనున్న కేంద్ర పన్నుల వాటా మొత్తం జాబితాను వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం సూచలన మేరకు రాష్ట్రాల నుంచి వసూలైన కేంద్ర పన్నుల రాబడిలో 42శాతం వాటాను ఆయా రాష్ట్రాలకు తిరిగి ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన కేంద్ర పన్నుల రాబడిలో కార్పొరేట్‌ పన్ను మొత్తం రూ. 9526 కోట్లు కాగా, ఆదాయపన్ను మొత్తం రూ. 8430 కోట్లు, కేంద్ర జీఎస్టీ మొత్తం రూ. 10,919 కోట్లు, సుంకాల మొత్తం 1671 కోట్లు, కేంద్ర ఎక్సైజ్‌ పన్నులు 1628 కోట్లు.. ఇందులో 2016-17 సంవత్సరం అంచనాలతో పోలిస్తే.. రూ. 849 కోట్లు లోటు కనిపిస్తున్నది.

ఇక, తెలంగాణకు దక్కిన కేంద్ర పన్నుల రాబడిలో కార్పొరేట్‌ పన్ను మొత్తం రూ. 5381 కోట్లు కాగా, ఆదాయపన్ను మొత్తం రూ. 4772 కోట్లు, కేంద్ర జీఎస్టీ మొత్తం రూ. 6181 కోట్లు, సుంకాల మొత్తం 946 కోట్లు, కేంద్ర ఎక్సైజ్‌ పన్నులు 946 కోట్లు.. ఇందులో 2016-17 సంవత్సరం అంచనాలతో పోలిస్తే.. రూ. 481 కోట్లు లోటు కనిపిస్తున్నది.

రాష్ట్రాలవారీగా కేంద్ర పన్నుల వాటాను క్రింది చిత్రపటంలో చూడొచ్చు..

మరిన్ని వార్తలు