రాకెట్‌లా ఎగిసిన రాష్ట్రాల లోటు

24 Jun, 2017 19:25 IST|Sakshi
రాకెట్‌లా ఎగిసిన రాష్ట్రాల లోటు
ముంబై : ఆ రెండు రాష్ట్రాలు దేశానికి అత్యంత కీలకం. ఒకటి అత్యంత ఎక్కువ జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ కాగ, మరొకటి అతిపెద్ద రాష్ట్రం రాజస్తాన్. కానీ వాటి వాణిజ్య లోటులు మాత్రం భారీగా ఎగిశాయి. ఆ రెండు రాష్ట్రాలివే కాక, మిగతా రాష్ట్రాల వాణిజ్య లోటులు కూడా స్కై రాకెట్ లా  ఎగిసినట్టు తెలిసింది.
 
1991 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వాణిజ్య లోటు రూ.18,790కోట్లుంటే, అవి కాస్త, 2016 ఆర్థిక సంవత్సరానికి రూ.4,93,360కోట్లకు పెరిగినట్టు తాజా ఆర్బీఐ డేటా పేర్కొంది.  ఆర్బీఐ రెండో ఎడిషన్ గణాంకాల ప్రచురణ ''హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ స్టేట్స్ 2016-17''  కింద ఈ డేటాను ఆర్బీఐ నేడు వెల్లడించింది. ప్రస్తుతం ఈ వాణిజ్య లోటును రూ.4,93,360 కోట్ల నుంచి రూ.4,49,520 కోట్లకు తగ్గించుకోవాలని అన్ని రాష్ట్రప్రభుత్వాలు తమ బడ్జెట్ లలో అంచనాలు వేసుకున్నాయి. 
 
ఉత్తరప్రదేశ్ వాణిజ్య లోటు 1991లో రూ.3070 కోట్లు ఉండగా.. 2016లో ఇది రూ.64,230కోట్లకు పెరిగింది. అయితే 2017 ఆర్థికసంవత్సరంలో వాణిజ్య లోటు కొంత మెరుగుపరుచుకుని రూ.49,960కోట్లగా ఉంచాలని బడ్జెట్ లో ఆ రాష్ట్రం నిర్ణయించింది. 2016 వాణిజ్యలోటులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంది. అంతేకాక రాజస్తాన్ స్థూల వాణిజ్య లోటు కూడా 1991 కంటే 2016లో భారీగానే రూ.67,350 కోట్లకు పెరిగింది.
 
దీన్ని లోటును కూడా రూ.40,530 కోట్లకు తగ్గించాలనుకుంటున్నారు.. పట్టణీకరణలోనూ, పరిశ్రమలోనూ ఎక్కువగా అభివృద్ది చెందిన రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్ర వాణిజ్య లోటు కూడా 1991 నుంచి 2016కు బాగానే పెరిగినట్టు తెలిసింది. 1991లో ఈ రాష్ట్ర లోటు రూ.1,020 కోట్లుంటే, 2016లో రూ.37,950 కోట్లగా నమోదైనట్టు ఆర్బీఐ డేటా పేర్కొంది.
 
అయితే ముందటేడాది కంటే ఈ ఏడాది కాస్త మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. అత్యంత వేగంగా పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందిన గుజరాత్ లో కూడా లోటు పెరగడం తక్కువేమీ కాదని ఆర్బీఐ పేర్కొంది. ఈ రాష్ట్రంలో 1991లో 1,800 కోట్ల వాణిజ్య లోటు ఉంటే, 2016లో రూ.22,170కోట్లకు తాజా గణాంకాలు చెప్పాయి.
 
ఆంధ్రప్రదేశ్ లో కూడా వాణిజ్య లోటు బాగానే పెరిగినట్టు తెలిసింది. ఈ రాష్ట్రంలో 1991లో రూ.970 కోట్ల లోటు ఉంటే, అది కాస్త 2016 నాటికి రూ17,000 కోట్లకు పెరిగినట్టు గణాంకాలు పేర్కొన్నాయి. గతేడాది కంటే అత్యధిక వాణిజ్యలోటును నమోదుచేసిన రాష్ట్రంగా తమిళనాడు, కర్నాటక, కేరళలు ఉన్నాయి.
మరిన్ని వార్తలు