ప్యాకేజీపై మార్కెట్‌ దృష్టి

27 Apr, 2020 01:30 IST|Sakshi

గురువారం ఏప్రిల్‌ సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు

ఈ వారంలో ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం

మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా

శుక్రవారం మార్కెట్‌కు సెలవు

యాక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, హెచ్‌యూఎల్‌ ఫలితాలు ఈవారంలోనే..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు ఈవారంలో జరిగే పరిణామాలు  కీలకం. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నందున ఈ విషమ పరిస్థితుల్లో భారీ ఆర్థిక ప్యాకేజీని మోదీ సర్కార్‌ ప్రకటిస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.

ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులే..
మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం (మే1) దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు సెలవు. దీంతో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైంది.

ఏప్రిల్‌ సిరీస్‌ ముగింపు ఈవారంలోనే..
గురువారం (30న) ఏప్రిల్‌ నెల ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌(ఎఫ్‌ అండ్‌ ఓ) సిరీస్‌ ముగియనుంది. బుధవారం సమావేశంకానున్న అమెరికా ఫెడ్‌.. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది. మరోవైపు, యాక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, హెచ్‌యూఎల్, హెక్సావేర్‌ టెక్నాలజీస్, టెక్‌ మహీంద్రా, అంబుజా సిమెంట్స్, అదానీ పవర్‌ ఫలితాలను ఈవారంలోనే ప్రకటించనున్నాయి.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు