చివరి వరకూ నష్టాలే..

6 May, 2019 15:39 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  భారీ నష్టాలతో ముగిశాయి. ఆరంభంనుంచి నష్టాల బాట పట్టిన కీలక సూచీలు  చివరివరకూ  బలహీనంగా కొనసాగాయి.  చివరికి  363 పాయింట్లు పతనమై 38600 వద్ద, నిఫ్టీ 114 వపాయింట్లు నష్టపోయి 11598 వద్ద స్థిరపడ్డాయి.  ఐటీ తప్ప  అన్ని రంగాలూ నష్టాల్లోనే ముగిశాయి.

రిలయన్స్‌,  ఐసీఐసీఐ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మొదట్లోలాభాల్లో ఉన్నప్పటికీ  మిడ్‌ సెషన్‌ తరువాత మరింత అమ్మకాల జోరు కొనసాగాగింది. దీంతో మార్కెట్లు 400 పాయిట్లకు పైగా నష్టపోయాయి. జీ 6 శాతం,   రిలయన్స్ ‌2  శాతం, ఐసీఐసీఐ 1 శాతం కుప్పకూలాయి.  అటు ఎస్‌ బ్యాంకు  ఈ రోజు కూడా 6శాతం  పతనమైంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ , టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి అమ్మకాల ఒత్తిడి భారీగా నెలకొంది. అటు బీపీసీఎల్‌, టీసీఎస్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, ఎయిర్‌టెల్‌, ఐవోసీ మాత్రమ స్వల్పంగా లా భాల్లో ముగిసాయి. మరోవైపు  మరికొద్దిసేపట్లో ప్రయివేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం  ఐసీఐసీఐ ఫలితాలను ప్రకటించనుంది.

మరిన్ని వార్తలు