నష్టాలే : 11200 దిగువకు నిఫ్టీ

29 Jul, 2019 16:07 IST|Sakshi

ఆటో ఇండెక్స్‌ 5 ఏళ్ల కనిష్టానికి

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంనుంచి నష్టాల్లో కొనసాగిన సూచీలు ఒక దశలో 360  పాయింట్లకు పైగా నష్టోయాయి. అనంతరం  150 పాయింట్ల మేర  కోలుకున్నప్పటికీ, చివరికి నష్టాల బాటనే ఆశ్రయించాయి. ముఖ్యంగా ఆటో, మెటల్‌ షేర్ల అమ్మకాలు మార్కెట్‌ను ప్రభావితం  చేశాయి. చివరకు సెన్సెక్స్‌  196 పాయింట్లు కుప్పకూలి 37686 వద్ద, నిఫ్టీ 95 పాయింట్లు  నష్టపోయి 11189 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 11200 స్థాయిని కూడా కోల్పోయింది.  ఐటీ తప్ప దాదాపు  అన్ని సెక్టార్లు నష్టాల్లోనే ముగిసాయి. దీంతో సూచీలు రెండూ రెండు నెలల కనిష్టానికి చేరగా  కేంద్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంపు నిర్ణయంతో నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 5 ఏళ్ల కనిష్టానికి చేరింది.

ఇండియా బుల్స్‌, గ్రాసిం, టాటా మోటార్స్‌, వేదాంతా, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఆటో, ఐషర్‌ మెటార్స్‌, మారుతి సుజుకి, టైటన్‌, యూపిఎల్‌, ఫలితాల నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఐసీఐసీఐ, ఇండస్‌,   హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌,  టెక్‌ మహీంద్ర లాభపడ్డాయి.

>
మరిన్ని వార్తలు