ఎగ్జిట్‌ పోల్స్‌ ఎఫెక్ట్‌ : మార్కెట్లు భా..రీ ర్యాలీ

20 May, 2019 09:22 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ఎగ్జిట్‌ 2019 ఫలితాల జోష్‌తో కీలక సూచీలు లాభాల పరుగందుకున్నాయి.  ఏకంగా  సెన్సెక్స్‌ 850  ఎగిసింది. నిఫ్టీ 230 పాయింట్లు  హై జంప్‌ చేసింది.  దాదాపు అన్ని సెక్టార్లు లాభపడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌  షేర్లు కొత్త గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. 

కేంద్రంలో తిరిగి బీజేపీ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్‌ పేర్కొనడంతో  ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బాగా మెరుగుపడింది. దీంతో  కొనగోళ్ల జోరు  ఊపందుకుంది. అయితే హై స్థాయిల్లో లాభాల స్వీకరణతో సెన్సెక్స్‌ 734 పాయింట్లు ఎగిసి 38665, వద్ద నిఫ్టీ 211 పాయింట్లు లాభంతో 11618 వద్ద కొనసాగుతోంది.  2014 తరువాత ఇదే అదిపెద్ద లాభాల ఓపెనింగ్‌ అని నిపుణులు చెబుతున్నారు.  ఎస్‌బీఐ, ఐసీఐసీఐ,కెనరా, సిండికేట్‌ బ్యాంక్స్‌,ఎస్‌బ్యాంకు, మారుతి, ఇండియాబుల్స్‌, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌, బీపీసీఎల్‌, అదానీ, ఎంఅండ్‌ఎం టాప్‌ విన‍్నర్స్‌గా ఉన్నాయి. అలాగే అడాగ్‌ షేర్లు లాభపడుతున్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌  3 శాతం నష్టపోతోంది. ఇంకా డాక్టర్‌ రెడ్డీస్‌ 3 శాతం నష్టంతో ట్రేడింగ్‌ ప్రారంభించగా, బజాజ్‌ఆటో, టెక్‌ మహింద్రా తదితరాలు నష్టపోతున్నాయి.

అటు దేశీయ కరెన్సీ రూపాయి భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించింది.   డాలరుమారకంలో 80పైసలు ఎగిసింది.  దీంతో రెండు వారాల గరిష్టాన్ని తాకింది. అంతేకాదు డిసెంబరు 2018 తరువాత   ఓపెనింగ్‌లో భారీగా లాభపడటం ఇదే తొలిసారి.

మరిన్ని వార్తలు