నష్టాలతో ప్రారంభం, మరింత పతనం

13 Apr, 2020 09:29 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. లాంగ్ వీకెండ్ అనంతరం కీలక సూచీలు నష్టాల్లో ట్రేడింగ్  ఆరంభించాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కోల్పోయింది. నష్టాలనుంచి కోలుకున్నా, వెంటనే మరింత కీణించిన సెన్సెక్స్ ప్రస్తుతం 600 పాయింట్ల నష్టంతో 30600 వద్ద, నిప్టీ 160 పాయింట్ల నష్టంతో 8942 వద్ద కొనసాగుతోంది. తద్వారా సెన్సెక్స్ 31 వేల స్థాయి, నిఫ్టీ 9వేల దిగువకు చేరింది. బ్యాంకింగ్, ఆటో సెక్టార్లు నష్టపోతున్నాయి. మారుతి, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్ ,  టైటన్, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్ర నష్టపోతుండగా, ఐఆర్ సీటీసీ, సిప్లా, భారతి ఎయిర్ టెల్  లాభపడుతున్నాయి. 

మరిన్ని వార్తలు