లాభాల జోరు, యస్‌ బ్యాంకు హుషారు

12 Dec, 2019 09:23 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి.  సెన్సెక్స్‌ 122 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. యస్‌బ్యాంకులో షార్ట్‌ కవరింగ్‌ కారణంగా యస్‌ బ్యాంకు షేరు లాభాల్లో ఉంది. అలాగే రూపాయ  పటిష్టం నేపథ్యంలో ఐటీ షేర్లు నష్టపోతున్నాయి.  వాహనాల అమ్మకాలు క్షీణించడంతో ఆటో కంపెనీలు నెగిటివ్‌గా ఉన్నాయి. టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, హీరో మోటో, ఎం అండ్‌ ఎం,ఎస్‌బీఐ  లాభపడుతున్నాయి. ఓఎన్‌జీసీ, జీ, భారతిఎయిర్‌టెల్‌,ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ,బ్రిటానియా,పవర్‌ గ్రిడ్‌, విప్రో నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి పాజిటివ్‌ ధోరణి గురువారం కూడా కొనసాగుతోంది. 16 పైసలు పుంజుకున్న రూపాయి 70.84 వద్ద వుంది. 

మరిన్ని వార్తలు