-

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

15 Jul, 2019 09:15 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 245 పాయింట్లు  లాభంతో ట్రేడ్‌ అవుతుండగా, నిఫ్టీ 51 పాయింట్ల లాభాలతో కొనసాగుతోంది. దాదాపు అన్ని  రంగాల  షేర్లు లాభ పడుతున్నాయి. ముఖ్యంగా క్యూ1 ఫలితాలతో ఇన్ఫీ టాప్‌ విన్నర్‌గా ఉంది.  ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, సన్ ఫార్మ, టైటన్‌, బ్రిటానియా  కూడా లాభపడుతున్నాయి.  అయితే  భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌  భారీ కుంభకోణం నేపథ్యంలో అలహాబాద్‌  బ్యాంకు 12 శాతం నష్టపోతోంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 10 శాతం పతనమైంది.  ఇండిగోది కూడా ఇదే బాట. హీరోమోటార్‌, జీ, ఎల్‌ అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, వేదాంతా, బజాజ్‌ ఆటో స్వల్పంగా నష‍్టపోతున్నాయి. 

అటు డాలరు మారకంలో రుపీ పాజిటివ్‌గా ప్రారంభమైంది.  సోమవారం 68.59వద్ద  ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 

మరిన్ని వార్తలు