నష్టాల్లోమార్కెట్లు:10600 కిందికి నిఫ్టీ

25 Apr, 2018 14:13 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో  మళ్లాయి.  ఇన్వెస్టర్ల అప్రమత్తత   నేపథ్యంలో ఆరంభ లాభాలనుంచి వెనక్కి మళ్లాయి. ముఖ‍్యంగాఎఫ్‌అండ్‌వో ముగింపు, ప్రపంచ మార్కెట్ల క్షీణత నేపథ్యంలో కీలక సూచీలు మద్దతు స్థాయిలకు దిగువన బలహీనంగా ట్రేడ్‌ అవుతున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 74 పాయింట్ల నష్టంతో 34,542కు చేరగా .. నిఫ్టీ 37 పాయింట్లు తక్కువగా 10,577 వద్ద ట్రేడవుతోంది. ఐటీ, రియల్టీ రంగం తప్ప  అన్ని రంగాల్లో నెగిటివ్‌గానే ఉన్నాయి.  

ఫలితాలు, ఇండస్‌ డీల్‌ నేపథ్యంలో  భారతి ఎయిర్‌టెల్‌ టాప్‌ విన్నర్‌గా ఉంది. రియల్టీ కౌంటర్లలో బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ , ఇండియాబుల్స్‌, డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌, హెచ్‌డీఐఎల్‌భారీగా లాభపడుతున్నాయి.  ఇంకా  ఎంఅండ్‌ఎం, టీసీఎస్, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, యస్‌బ్యాంక్‌, బీపీసీఎల్‌, అల్ట్రాటెక్‌  తదితరాలు లాభపడుతున్నాయి. మరోవైపు  గెయిల్‌, సిప్లా, వేదాంతా, ఓఎన్‌జీసీ, హిందాల్కో, టాటా స్టీల్‌, గ్రాసిమ్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, డాక్టర్‌ రెడ్డీస్‌  నష్టపోతున్న వాటిలో​ ఉన్నాయి.

అటు కరెన్సీ మార్కెట్‌లో బుధవారం మరోసారి బలహీన పడిన రుపాయి 67 స్థాయికి దిగజారేందుకు  సిద్ధంగా ఉంది.  డాలర్‌ మారకంలో 0.41పైసల నష్టంతో   66.79 వద్ద కొనసాగుతోంది.  ఇంక బంగారం విషయానికి వస్తే.. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో పుత్తడి స్వల్పంగా నష్టపోతోంది.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు