అజంతా, అలెంబిక్‌ ఫార్మా బై: బ్రోకరేజ్‌ల రికమెండేషన్లు

23 May, 2020 16:13 IST|Sakshi

ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేయాలని చెబుతూ.. కొన్ని షేర్లను బ్రోకరేజ్‌ సంస్థలు సిఫార్సులు చేస్తున్నాయి. అవి ఈ విధంగా ఉన్నాయి.

కంపెనీ పేరు: ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ లిమిటెడ్‌
బ్రోకరేజ్‌ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
రేటింగ్‌: మరిన్ని కొనవచ్చు
టార్గెట్‌ ధర:రూ.1800
ప్రస్తుత ధర: రూ.1783

బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎల్‌అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ షేర్లను మరిన్ని కొనవచ్చని చెబుతూ టార్గెట్‌ ధరను రూ.1800 గా నిర్ణయించింది. పటిష్టమైన పోర్ట్‌పోలియోతోపాటు, అగ్రఖాతాలలో స్థిరత్వం ఉన్నందున ఈ షేర్లను కొనుక్కోవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు ధర రూ.1783.25 గా ఉంది.

కంపెనీ పేరు: అలెంబిక్‌ ఫార్మా
బ్రోకరేజ్‌ సంస్థ:యస్‌ సెక్యూరిటీస్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.1100
ప్రస్తుత ధర: రూ.897 

అలెంబిక్‌ ఫార్మా షేరుకు బ్రోకరేజ్‌ సంస్థ బైరేటింగ్‌ను ఇస్తూ టార్గెట్‌ ధరను రూ.11000గా నిర్ణయించింది. ఈ కంపెనీకు ఆదాయం బాగానే వస్తుందని, టొరంట్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ కంపెనీ కంటే అధికంగా డిస్కౌంట్‌లు ఇచ్చి వ్యాపారం చేస్తోంది. అందువల్ల ఈ షేరును కొనవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ కంపెని షేరు ధర రూ. 897.50గా ఉంది.

కంపెనీ పేరు: అజంతా ఫార్మా
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌​ ఓస్వాల్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.1700
ప్రస్తుత ధర: రూ.1,510

బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ అజంతా ఫార్మా షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ, టార్గెట్‌ ధరను రూ.1700 గా నిర్ణయించింది. అజంతా ఫార్మా ప్రధాన క్యాపెక్స్‌ కార్యక్రమం ఆర్థిక సంవత్సరం-21లో ముగుస్తుంది.నిర్వహణ క్యాపెక్స్‌ ఆర్థిక సంవత్సరం-22లో అవసరమని ఇది సంస్థకు ఉచిత నగదు ప్రవాహాన్ని సూచిస్తుందని తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.1,510.30 గా ఉంది.

కంపెనీ పేరు: ఆల్ట్రా టెక్‌ సిమెంట్‌
బ్రోకరేజ్‌ సంస్థ: యస్‌ సెక్యూరిటీస్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.4413
ప్రస్తుత ధర: రూ.3,638

బ్రోకరేజ్‌ సంస్థ యస్‌ సెక్యూరిటీస్‌ ఆల్ట్రా టెక్‌ షేరుకు బై రేటింగ్‌ను ఇస్తూ, టార్గెట్‌ ధరను రూ.4413గా నిర్ణయించింది. ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌కు చెందిన సెంచురీ టెక్స్‌టైల్స్‌ వినియోగం క్యూ4లో 83 శాతం పెరిగిందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.3,638.40 గా ఉంది.

కంపెనీ పేరు: బజాజ్‌ ఆటో
బ్రోకరేజ్‌ సంస్థ: ఎమ్‌కే గ్లోబల్‌
రేటింగ్‌: హోల్డ్‌
టార్గెట్‌ ధర: రూ.2629
ప్రస్తుత ధర: రూ.2,552

 బ్రోకరేజ్‌ సంస్థ ఎమ్‌కే గ్లోబల​ బజాజ్‌ ఆటో షేరు రేటింగ్‌ను హోల్డ్‌లో ఉంచుతూ టార్గెట్‌ ధరను రూ.2629 గా నిర్ణయించింది. త్రీవీలర్‌ డిమాండ్‌, ఎగుమతుల అధిక మార్జిన్‌ అవకాశాలు తగ్గుతాయని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. త్రీవీలర్‌ ధరల పెరుగుదల దేశీయ డిమాండ్‌పై పడుతుందని తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు ధర రూ.2,552.75 గా ఉంది. 

Related Tweets
మరిన్ని వార్తలు