సెన్సెక్స్‌ భారీ పతనం

10 Sep, 2018 13:17 IST|Sakshi

సాక్షి, ముంబై : స్టాక్ మార్కెట్లు  భారీ పతనాన్ని నమోదు చేస్తున్నాయి. ట్రేడింగ్ ఆరంభం నుంచి నెగిటివ్ సెంటిమెంట్‌తో నీరసపడిన కీలక సూచీలు మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్ల ఆందోళన నేపథ్యంలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది.  దీంతో  సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా పతనమైంది. ఒక దశలో 420 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ 38వేల కీలక మద్దతు స్థాయి దిగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 122 పాయింట్లు క్షీణించింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా నష్టంలోనే 37,971 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 138 పాయింట్ల నష్టంలో 11,450 వద్ద కొనసాగుతోంది. బ్యాంకు నిఫ్టీ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా పీఎస్‌యూ  బ్యాంకుల సూచీ రెండు శాతం దాకా నష్టపోగా, ఫార్మా, రియాల్టి, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు ఒక శాతంపైగా నష్టపోయాయి.
 
ముఖ్యంగా రూపీ అత్యంత కనిష్టానికి చేరడంతో మిడ్ సెషన్‌కి మార్కెట్లు 1 శాతం మేర నష్టాల్లోకి చేరుకున్నాయి.  గత ముగింపుతో పోల్చితే డాలరుతో దేశీయ కరెన్సీ రూపాయి ఏకంగా 91 పైసలు క్షీణతను నమోదుచేసి 73 స్థాయి పతనానికి  చేరువలో ఉంది. సన్‌ ఫార్మా, రెడ్డీ ల్యాబ్స్‌, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, బీపీసీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లు టాప్‌ లూజర్స్‌గా ఉండగా, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, విప్రో,  ఇన్ఫోసిస్‌, లుపిన్, యాక్సిస్ బ్యాంక్‌లు టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పై పేటెంట్‌ ఉల్లంఘన కేసు

హెచ్‌పీసీఎల్‌కు 2,970 కోట్ల లాభం 

ఏప్రిల్‌లో భారీగా పెరిగిన  పసిడి దిగుమతులు 

తుది ఫలితాలపైనే కార్పొరేట్ల దృష్టి 

ఫలితాల్లో అదరగొట్టిన భారత్‌ఫోర్జ్‌ 

వాహన బీమా మరింత భారం..

రూపాయికీ ‘ఎగ్జిట్‌’ బూస్ట్‌! 

మార్కెట్‌కు ‘ఎగ్జిట్‌’ జోష్‌!

టాటా మోటార్స్‌ లాభం 49% డౌన్‌ 

ఇక పాలు మరింత ప్రియం..

సెన్సెక్స్‌ దూకుడు

చమురు,సహజ వాయువు రంగంలో ‘ఎంఈఐఎల్’

అదానీకి ఎగ్జిట్‌ పోల్స్‌ కిక్‌

బుల్‌ రన్‌ : వెయ్యి పాయింట్లు అప్‌

ముగిసిన ఎన్నికలు ‌: ఎగిసిన పెట్రో ధరలు

ముంబై-న్యూయార్క్‌ విమానాలు నిలిపివేత

రెండు వారాల గరిష్టానికి  రుపీ

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎఫెక్ట్‌ : మార్కెట్లు భా..రీ ర్యాలీ

‘సిప్‌’లు ఆగటం లేదు!

దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులు

మీకొక నామినీ కావాలి..?

వాణిజ్యపోరులో మరీ దూరం వెళ్లొద్దు

తక్షణ నిరోధం 38,600... మద్దతు 37415

ఎన్నికల ఫలితాలే దిక్సూచి

మన ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై గూగుల్‌ కన్ను

భారీ బ్యాటరీతో వివో వై3 లాంచ్‌

వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌...వారికి భారీ ఊరట

స్వల్పంగా తగ్గిన పెట్రోలు ధరలు

షావోమి బాస్‌ నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరు?

స్నాప్‌డీల్‌ సమ్మర్‌ మెగా డీల్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమస్యలపై మేజర్‌ పోరాటం

చంద్రబోస్‌కి మాతృవియోగం

600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

ఫలక్‌నుమా... తెలుగు సినిమాకి కొత్త

పగ తీరేనా?

జర్నీ ఎండ్‌!