వారాంతంలో భారీ లాభాలు :   బ్యాంక్స్‌, ఆటో జూమ్‌

6 Sep, 2019 15:48 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీ స్టాక్‌మార్కెట్లు  భారీ లాభాల్లో ముగిసాయి.  దాదాపు వారమంతా  నష్టాలతో బేర్‌మన్‌ దలాల్‌ స్ట్రీట్‌ వారంతంలోఊరట చెందింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది.  దీంతో సెన్సెక్స్‌ 337 పాయంట్లు పుంజుకుని 36982 వద్ద, నిఫ్టీ 98 పాయింట్లు ఎగిసి 10946 వద్ద స్థిరపడ్డాయి.  ఈ వారంలో  సెన్సెక్స్‌ , నిఫ్టీ, నిఫ్టీ బ్యాంకు దాదాపు 1శాతం నష్టపోయాయి. 

ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో, మీడియా పుంజుకోగా  రియల్టీ  సెక్టార్‌ నష్టపోయింది. ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, యస్‌బ్యాంకు, సన్‌ ఫార్మా, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.  ఏటీ అండ్‌ టీ తో   మెగా డీల్‌ వార్తలతో టెక్‌మహీంద్ర భారీగా లాభపడింది. మారుతి సుజుకి, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంకు, బజాజ్‌ ఆటో, టాటా మోటార్స్‌,  ఎం అండ్‌​ అండ్‌ లాభపడ్డాయి. 

మరిన్ని వార్తలు