మార్కెట్ల యూటర్న్‌: భారీ నష్టాల్లోకి

6 Mar, 2018 15:08 IST|Sakshi

సాక్షి,ముంబై: వరుసనష్టాలనుంచి కోలుకుని లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో అందిపుచ్చుకున్నప్పటికీ   మిడ్‌ సెషన​ తరువాత భారీ నష్టాలను చవిచూశాయి.   ముఖ్యంగా బ్యాంకింగ్  సెక్టార్లోని భారీ నష్టాలు కీలక సూచీలను పతనం దిశగా తీసుకెడుతున్నాయి.  అలాగే హైయర్ లెవెల్స్‌లో ట్రేడర్లు ప్రాఫిట్ బుకింగ్ చేయడం ఇండెక్స్‌ల పతనానికి కారణమని మార్కెట్‌ విశ్లేకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం 217పాయింట్లు  పతనంతో  సెన్సెక్స్ 33530 వద్ద, 55పాయింట్ల నష్టంతో  10303 వద్ద కొనసాగుతోంది.  ఐసీఐసీఐ, యాక్సిస్‌, కోటక్‌ బ్యాంక్‌ , బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా,  బ్యాంక్‌ ఆప్‌ బరోడా,  సన్‌ ఫార్మ,  కాంకర్‌,  బలరాం పురీ  చినీ, డిష్‌ టీవీ తదితర  షేర్లు నష్టపోతున్నాయి.  బీపీసీసీఎల్‌, గ్లెన్‌మార్కె, అల్ట్రా సిమెంట్‌ సన్‌టీవీ, లాభపడుతున్నాయి.  

మరిన్ని వార్తలు