ప్రాఫిట్‌ బుకింగ్‌: ఆరంభ లాభాలు ఆవిరి

4 Mar, 2020 09:24 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడు రోజు కూడా లాభాలతో ప్రారంభమైనాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 90 పాయింట్లు ఎగియగా, నిప్టీ 30  పాయింట్లు లాభపడింది. అయితే వెంటనే ఇన్వెస్టర్ల ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా  మార్కెట్లు  నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్‌ 52 పాయింట్లు క్షీణించి 38575 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు  నష్టంతో11286 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  తద్వారా నిఫ్టీ 11300 దిగువకు చేరింది. ముఖ్యంగా  ఔషధాల ఎగుమతులపై  ఆంక్షలు విధించిన నేపథ్యంలో  ఫార్మ షేర్లు బలహీనంగా ఉన్నాయి.  మిడ్‌ క్యాప్‌ మెటల్‌, బ్యాంక్‌ నిఫ్టీ ,ఆటో రంగాలు నష‍్టపోతున్నాయి.  ఐటీ షేర్లులాభపడుతున్నాయి.  టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఇండస్‌  ఇండ్‌, పవర్‌  గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు,ఓఎన్‌జీసీ నష్టపోతుండగా, ఎయిర్‌లైన్‌ షేర్లు, ఇండిగో, స్పైస్‌ జెట్‌ కూడా బాగా నష్టపోతున్నాయి.  బజాజ్‌ ఆటో, ఏసియన్‌ పెయింట్స్‌,యూపీఎల్‌, టైటన​, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో,భారతి ఇన్‌ఫ్రాటెల్‌ లాభపడుతున్నాయి. 

మరోవైపు ఫెడ్‌ వడ్డీ రేటు కట్‌ నిర్ణయంతో డాలరు బాగా బలహీనపడింది. ఈ నేపథ్యంలో దేశీయ కరెన్సీ  రూపాయి కనిష్టం నుంచి కోలుకుంది. 
 

>
మరిన్ని వార్తలు